మదనపల్లెలో నేడే ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:15 AM
ముగ్గుల పోటీలకు మదనపల్లె ఆర్టీసీ బస్టాండు సమీపంలోని జడ్‌పీ హైస్కూల్ ఆవరణం ముస్తాబైంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటక, తమిళనాడుల్లోనూ ఈ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయి. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గులపోటీలు..పవర్డ్‌బై సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీల సౌజన్యంతో జరుగుతున్నాయి. మదనపల్లె జిల్లా పోటీలకు లోకల్ స్పాన్సర్‌గా మ్యాజిక్ సీడ్స్ కంపెనీ అధినేత సీడ్స్ మల్లికార్జుననాయుడు వ్యవహరిస్తున్నారు. పోటీల్లో పాల్గొనదలచిన మహిళలు ముందుగానే జడ్పీ హైస్కూల్ మైదానానికి చేరుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి, రెండు, మూడవ బహుమతులు ఉంటాయి.
- ముస్తాబైన జడ్పీ హైస్కూల్ మైదానం
ఆంధ్రజ్యోతి- మదనపల్లె
ముగ్గుల పోటీలకు మదనపల్లె ఆర్టీసీ బస్టాండు సమీపంలోని జడ్‌పీ హైస్కూల్ ఆవరణం ముస్తాబైంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా రెండు తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటక, తమిళనాడుల్లోనూ ఈ ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయి. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గులపోటీలు..పవర్డ్‌బై సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీల సౌజన్యంతో జరుగుతున్నాయి. మదనపల్లె జిల్లా పోటీలకు లోకల్ స్పాన్సర్‌గా మ్యాజిక్ సీడ్స్ కంపెనీ అధినేత సీడ్స్ మల్లికార్జుననాయుడు వ్యవహరిస్తున్నారు. పోటీల్లో పాల్గొనదలచిన మహిళలు ముందుగానే జడ్పీ హైస్కూల్ మైదానానికి చేరుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి, రెండు, మూడవ బహుమతులు ఉంటాయి. ముగ్గు వేసిన ప్రతి మహిళకు కానుకలు అందుతాయి. మదనపల్లెలో మొదటి బహుమతి అందుకున్న ముగ్గు వేసిన మహిళ ఈనెల 10న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత పొందుతారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలచిన ఇద్దరికి రూ.30 వేలు విలువైన బహుమతులు అందజేస్తారు. మరో 8 మందికి రూ.10 వేలు విలువైన బహుమతులు లభిస్తాయి. మొత్తం రూ.20లక్షలు విలువ చేసే బహుమతులను ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలు అందుకుంటారు. మదనపల్లెలో ఆదివారం ఉదయం జరిగే ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల హాజరవుతారు.
ఇవీ నియమాలు
-ముగ్గు, రంగులు, పువ్వులు వగైరా సామగ్రి పోటీలో పాల్గొనే మహిళలే తెచ్చుకోవాలి.
-చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి.
-పోటీ సమయం రెండు గంటలు మాత్రమే.