ట్రయల్ రన్
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:04 AM
చిత్తూరు-తచ్చూరు హైవేపై ట్రయల్ రన్ మొదలైంది. ఈ మార్గంలో బుధవారం పలు వాహనాలు ప్రయాణించాయి. ఈ హైవే మొత్తం 116 కిలోమీటర్లు. అనుపల్లె, అరతల, నరసింహాపురం, పల్లిపట్టు, నగరి, ఊతుకోట, కుమారరాజపేట, ఎస్‌ఆర్‌పురం, వీరకావేరిరాజపురం, పొందవాక్కం.. ఈ ఏడు చోట్ల హైవేపైకి చేరడానికి లింకు రోడ్డు సదుపాయముంది.
చిత్తూరు-తచ్చూరు హైవేపై ట్రయల్ రన్ మొదలైంది. ఈ మార్గంలో బుధవారం పలు వాహనాలు ప్రయాణించాయి. ఈ హైవే మొత్తం 116 కిలోమీటర్లు. అనుపల్లె, అరతల, నరసింహాపురం, పల్లిపట్టు, నగరి, ఊతుకోట, కుమారరాజపేట, ఎస్‌ఆర్‌పురం, వీరకావేరిరాజపురం, పొందవాక్కం.. ఈ ఏడు చోట్ల హైవేపైకి చేరడానికి లింకు రోడ్డు సదుపాయముంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊతుకోట వరకు 95 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. దాదాపు పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్‌కు అనుమతించారు. ఈ రోడ్డుపై సుమారు 100 కి.మీ వేగంతో 95 కిలోమీటర్లను ఒకటిన్నర గంటల్లో చేరుకోవచ్చని అధికారులు అంచనా వేశారు.
- చిత్తూరు సిటి, ఆంధ్రజ్యోతి