Share News

ఐఐటీలో పలు అంశాలపై శిక్షణ

ABN , Publish Date - May 27 , 2026 | 01:27 AM

ఏర్పేడు సమీపంలో వున్న ఐఐటీలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సు -స్మార్ట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఈవీ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 ఐఐటీలో పలు అంశాలపై శిక్షణ

ఏర్పేడు, మే 26 (ఆంధ్రజ్యోతి):ఏర్పేడు సమీపంలో వున్న ఐఐటీలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సు -స్మార్ట్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఈవీ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.విప్రో, సీమెన్స్‌ సంస్థల సహకారంతో ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌, ఆడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, మెకాట్రానిక్స్‌, స్మార్ట్‌ మైక్రోగ్రిడ్‌ కంట్రోలర్‌, ఎన్వీ హెచ్‌ అనాలిసిస్‌ వంటి అత్యాధునిక అంశాలపై 5రోజుల పాటు శిక్షణ ఉంటుంది.విద్యార్థులు, అధ్యాపకులు, వృత్తి నిపుణులు దరఖాస్తు చేసుకోవచ్చు.సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు-ఎస్‌ఎంఈవీటీ, ఐఐటీ, వెంకటగిరి రోడ్డు, ఏర్పేడు చిరునామాకు దరఖాస్తులను పంపాలి.

Updated Date - May 27 , 2026 | 01:27 AM