Share News

ఎన్నికల విధుల్లో విషాదం

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:33 AM

ఎన్నికల విధుల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందిన ఘటన పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లె పోలింగ్‌ కేంద్రంలో ఆధివారం చోటు చేసుకుంది.

ఎన్నికల విధుల్లో విషాదం
కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో వీణమ్మకు సీపీఆర్‌ చేస్తున్న మహిళా పోలీసు కానిస్టేబుల్‌

గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

కల్లూరు, నవంబర్‌ 29(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందిన ఘటన పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లె పోలింగ్‌ కేంద్రంలో ఆధివారం చోటు చేసుకుంది. ఐరాల మండలం నాంపల్లెకు చెందిన వీణమ్మ(62) అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఎన్నికల విధుల్లో భాగంగా పులిచెర్ల మండలం అయ్యావాండ్లపల్లె పోలింగ్‌ కేంద్రంలో ఆమెకు ఓపీవోగా డ్యూటీ వేశారు. ఆదివారం సాయంత్రం పోలింగ్‌ కేంద్రంలో విధులు పూర్తి చేసుకుంటున్న సమయంలో వీణమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన కల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ సీపీఆర్‌ నిర్వహించిన అనంతరం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ సంఘటనపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు తహసీల్దార్‌ జయసింహ తెలిపారు.

Updated Date - Nov 30 , 2026 | 01:33 AM