Share News

ట్రాఫిక్‌ కష్టాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:14 AM

తిరుపతిలో శనివారం ట్రాఫిక్‌ కష్టాలు జనానికి నరకం చూపించాయి. శనివారం కావడంతో నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయలేదు.

ట్రాఫిక్‌ కష్టాలు

కరెంటు లేక పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నళ్లు

ప్రధాన కూడళ్లలోనూ కన్పించని పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో శనివారం ట్రాఫిక్‌ కష్టాలు జనానికి నరకం చూపించాయి. శనివారం కావడంతో నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయలేదు.ట్రాఫిక్‌ పోలీసులు కూడా కనిపించకపోవడంతో ట్రాఫిక్‌ కట్టుదప్పింది. బస్టాండు సమీపంలోని సుబ్బులక్ష్మి సర్కిల్‌, రామానుజ కూడలి, లీలామహల్‌ సర్కిల్లో వాహనాలు బారులు తీరాయి. వచ్చే,పోయే వాహనాలు కలగలిసిపోయి సుబ్బులక్ష్మి సర్కిల్‌వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అలాగే రామానుజ సర్కిల్‌ వద్దకూడా వాహనాలు బారులు తీరాయి.

Updated Date - Apr 12 , 2026 | 01:14 AM