తగ్గిన టమోటా ధరలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:22 AM
టమోటా దిగుబడులు పెరిగాయి. ధరలు తగ్గిపోయాయి. ఎల్‌నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రత టమోటా రైతుల పాలిట శాపంగా మారింది. ఎండల తీవ్రతతో తోటల్లో దిగుబడులు భారీగా పెరిగాయి. శనివారం పుంగనూరు, పలమనేరు, సోమల మార్కెట్లలో 15కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.100 మాత్రమే పలికాయి. మార్చి, ఏప్రిల్ నెలలో నాట్లు వేసిన రైతుల పొలాల నుంచి దిగుబడులు వస్తున్నాయి. వీటికి తోడు కొందరి టమోటా తోటల్లో కాయలు గోళీ కాయ సైజులో ఉంటున్నాయి. గోళీ కాయలు మార్కెట్‌లో అమ్ముడు పోవడం లేదు. జూన్ 6, 7 తేదీల్లో నాణ్యత గల 15కిలోల బాక్సు రూ.500, రూ.600 మించి పలికింది.
సోమల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): టమోటా దిగుబడులు పెరిగాయి. ధరలు తగ్గిపోయాయి. ఎల్‌నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రత టమోటా రైతుల పాలిట శాపంగా మారింది. ఎండల తీవ్రతతో తోటల్లో దిగుబడులు భారీగా పెరిగాయి. శనివారం పుంగనూరు, పలమనేరు, సోమల మార్కెట్లలో 15కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.100 మాత్రమే పలికాయి. మార్చి, ఏప్రిల్ నెలలో నాట్లు వేసిన రైతుల పొలాల నుంచి దిగుబడులు వస్తున్నాయి. వీటికి తోడు కొందరి టమోటా తోటల్లో కాయలు గోళీ కాయ సైజులో ఉంటున్నాయి. గోళీ కాయలు మార్కెట్‌లో అమ్ముడు పోవడం లేదు. జూన్ 6, 7 తేదీల్లో నాణ్యత గల 15కిలోల బాక్సు రూ.500, రూ.600 మించి పలికింది. 14వ తేదీకి రూ.300, రూ.400, 20వ తేదీకి రూ.200కు పడిపోయింది. జూలై 1వ తేదీకి రూ.150 టాప్ ధర పలికి శనివారం నాణ్యత గల టమోటా రూ.100 లోపు పలకడంతో రైతుల్లో నిరాశ నెలకొంది. వీటికి తోడు ఎండల వేడికి ఎర్ర నల్లి, బూడిద తెగులు, పలు రకాల వైర్‌సలతో తోటలు దెబ్బతింటున్నాయి. వేలకు వేలు వ్యయం చేస్తూ మందులు పిచికారీ చేస్తున్నా చీడలు పోవడం లేదు. సోమల మండలంలో 3వేల ఎకరాల్లో టమోటా సాగు ఉంది. వీటికి తోడుగా మండలంలోకి కలకడ, మహల్, కోన, మదనపల్లె, చిన్నమండ్యం తదితర ప్రాంత వలస రైతులు ఎకరా రూ.40, రూ.50 వేలతో లీజుకు తీసుకుని పంటలు సాగు చేశారు. ఎకరా సాగుకు రూ.2లక్షలు మించి ఖర్చు చేశారు. కూలీలు దొరక్క కోతలు చేయలేకపోతున్నారు. కలకడ, దేవపట్ల, మహల్ ప్రాంతాల నుంచి ఆటోల్లో కూలీలు వస్తున్నారు.