Share News

టమోటా ధర పైపైకి..

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:54 AM

టమోటా ధరలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. ఆదివారం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం కేజీ రూ.40 పలికాయి. సోమవారం గుర్రంకొండ మార్కెట్లో రూ.46 పలికాయి.

టమోటా ధర పైపైకి..
టమోటాలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

గుర్రంకొండ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): టమోటా ధరలు రోజు రోజుకూ పుంజుకుంటున్నాయి. ఆదివారం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం కేజీ రూ.40 పలికాయి. సోమవారం గుర్రంకొండ మార్కెట్లో రూ.46 పలికాయి. బయట రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో రేట్లు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగానూ మార్కెట్లకు వచ్చే సరుకు తగ్గుతోంది. దీనికితోడు బయటి రాష్ర్టాల వ్యాపారులు వస్తుండటంతో ధరలు పెరుగుతున్నాయి. గుర్రంకొండ మార్కెట్‌ యార్డులో సోమవారం 15 కిలోల క్రేట్‌ ధర గరిష్టంగా రూ.700 పలికింది. టమోటా ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 01:54 AM