Share News

కిలో టమోటా రూ.8

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:32 AM

మదనపల్లె మార్కెట్‌లో రోజురోజుకూ టమోటా ధరలు తగ్గుతున్నాయి. రెండు వారాల క్రితం వరకు నాణ్యత లేని రెండో రకం కిలో రూ.10పైనే పలికేవి. వారం రోజుల నుంచి ఈ రకం టమోట రూ.9 మాత్రమే పలుకగా శనివారానికి మరింత తగ్గి రూ.8కి చేరింది.

కిలో టమోటా రూ.8
మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

పవర్‌ రకం కొనుగోలుకు వ్యాపారుల విముఖత

మదనపల్లె టౌన్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): మదనపల్లె మార్కెట్‌లో రోజురోజుకూ టమోటా ధరలు తగ్గుతున్నాయి. రెండు వారాల క్రితం వరకు నాణ్యత లేని రెండో రకం కిలో రూ.10పైనే పలికేవి. వారం రోజుల నుంచి ఈ రకం టమోట రూ.9 మాత్రమే పలుకగా శనివారానికి మరింత తగ్గి రూ.8కి చేరింది. మదనపల్లె మార్కెట్‌కు 1,403 మెట్రిక్‌ టన్నుల టమోటా విక్రయానికి రాగా మొదటి రకం గరిష్టంగా కిలో రూ.16 ధర పలుకగా, రెండో రకం కనిష్టంగా కిలో రూ.8 మాత్రమే పలికింది. ములకలచెరువులో 808 టన్నుల టమోటా విక్రయానికి రాగా మొదటి రకం రూ.17, రెండో రకం రూ.9 పలికాయి. పుంగనూరులో 643 టన్నులు విక్రయానికి రాగా మొదటి రకం కిలో రూ.17, రెండోరకం కిలో 11 ధర పలికింది. అంగళ్లులో 511 టన్నులు రాగా మొదటి రకం కిలో రూ.20, రెండో రకం రూ.12 పలికాయి. సోమల, కలికిరి, వాల్మీకిపురం మార్కెట్లకు 351 టన్నులు రాగా మొదటి రకం రూ.18, రెండో రకం కిలో రూ.12 ధరలు పలికాయి. కాగా ఈ సీజన్‌లో రైతులు ఎక్కువగా కొత్తరకం టమోట వంగడాన్ని సాగు చేయగా ఎకరాకు 15 కోతల దాకా దిగుబడి వచ్చింది. తొలుత ఈ టమోటాను ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసిన వ్యాపారులు తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోతుండటంతో కొనుగోలు తగ్గించేశారు. ఏదో ఒక ధరకు కొనుగోలు చేయాలని రైతులు ఒత్తిడి చేయడంతో ధ

రలు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

Updated Date - Jul 19 , 2026 | 01:32 AM