Share News

టమో‘ఠా’

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:17 AM

ఎప్పుడూ లేనట్లుగా ఫిబ్రవరిలో టమోటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. పలమనేరు మార్కెట్‌లో మంగళవారం 15 కిలోల బాక్సు కనిష్టంగా రూ.90 నుంచి గరిష్టంగా రూ.100 ధర పలికింది. సాధారణంగా టమోటా ధరలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో క్రమేపీ పెరుగుతుంటాయి. కేవలం 15 కిలోల టమోటాలు కనీసం రూ. 400నుంచి గరిష్ఠంగా రూ.700 వరకు కూడా పలికేవి. దీనికి భిన్నంగా, ఈ ఏడాది పొడవునా టమోటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ నెలలో పెరుగుతుంది.. వచ్చే నెలలో పెరుగుతుంది.. అంటూ రైతులు ఇంతకాలం ఎదురు చూసిచూసి నిరాశకు గురవుతున్నారు.

టమో‘ఠా’
పలమనేరు మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

  • దారుణంగా పడిపోయిన ధరలు

- పలమనేరు, ఆంధ్రజ్యోతి: ఎప్పుడూ లేనట్లుగా ఫిబ్రవరిలో టమోటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. పలమనేరు మార్కెట్‌లో మంగళవారం 15 కిలోల బాక్సు కనిష్టంగా రూ.90 నుంచి గరిష్టంగా రూ.100 ధర పలికింది. సాధారణంగా టమోటా ధరలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో క్రమేపీ పెరుగుతుంటాయి. కేవలం 15 కిలోల టమోటాలు కనీసం రూ. 400నుంచి గరిష్ఠంగా రూ.700 వరకు కూడా పలికేవి. దీనికి భిన్నంగా, ఈ ఏడాది పొడవునా టమోటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ నెలలో పెరుగుతుంది.. వచ్చే నెలలో పెరుగుతుంది.. అంటూ రైతులు ఇంతకాలం ఎదురు చూసిచూసి నిరాశకు గురవుతున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 02:18 AM