Share News

కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ

ABN , Publish Date - May 27 , 2026 | 01:32 AM

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిపోయారు. జాతర తర్వాత వచ్చిన రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలవిరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణాలు, వజ్ర కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కరెన్సీ నోట్లతో గర్భాలయం, ముఖద్వారం అలంకరించారు.

కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ

తిరుపతి(కల్చరల్‌), మే 26(ఆంధ్రజ్యోతి): తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం కరెన్సీ నోట్ల అలంకారంలో మెరిసిపోయారు. జాతర తర్వాత వచ్చిన రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలవిరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వాభరణాలు, వజ్ర కిరీటంతో అమ్మవారిని అలంకరించారు.భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కరెన్సీ నోట్లతో గర్భాలయం, ముఖద్వారం అలంకరించారు.దాదాపు రూ.50లక్షల కరెన్సీ నోట్లను ఈ అలంకారంలో ఉపయోగించారు. భక్తులు విశ్వరూప స్తూపం వద్ద పొంగళ్లు పెట్టి అంబళ్లు పోసి పూజలు చేశారు.పౌరాణిక వేషాలతో రాయలసీమ రంగస్థలి కళాకారులు గంగమ్మను దర్శించుకున్నారు.ఆలయ చైర్మన్‌ మహేష్‌ యాదవ్‌, ఈవో జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 01:32 AM