Share News

పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై తిరుపతి రోల్‌ మోడల్‌గా వుండాలి

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:25 AM

పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో తిరుపతి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు.

పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై తిరుపతి రోల్‌ మోడల్‌గా వుండాలి
సమావేశంలో ప్రసంగిస్తోన్న కృష్ణయ్య, పక్కన కలెక్టర్‌

కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో తిరుపతి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌ పి.కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణపై కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారు కొలువై ఉన్న తిరుపతికి రోజూ లక్షలాది మంది భక్తులు నిత్యం వచ్చిపోతుంటారన్నారు. పవిత్ర నగరం కావడంతో ఇక్కడ అభివృద్ధి చేసే పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ నమూనాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కేవలం నిబంధనలు, ఆదేశాలతో కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన అమలు, ప్రజల్లో స్వయం క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, వారిలో మార్పు తీసుకురావడం అధికారుల బాధ్యత అన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుకాణాలు సీజ్‌ చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా క్లాత్‌, జూట్‌, బయోడిగ్రేడబుల్‌ సంచులు వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇక మున్సిపాలిటీల్లో వేస్ట్‌ ఎక్చేంజ్‌సెంటర్లను ఏర్పాటును పరిశీలించి అనధికారిక వ్యర్థ సేకరణదారులను వ్యవస్థీకృత విధానంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్మీకం పోస్టు విస్తరించి తద్వారా పారిశుధ్య కార్మికులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. పొడిచెత్త సేకరణకు స్వచ్ఛ రథాలు, గ్రీన్‌ షాపుల వంటి వినూత్న నమూనాలను మరింత ప్రోత్సహించాలన్నారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ భారత్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జరిమానా విధిస్తున్నామన్నారు ఈ సమావేశంలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ నాగేశ్వరరావు, డీపీవో సుశీలాదేవి, జడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాజశేఖర్‌, శంకర్‌రావు, ఏపీఐఐసీ జోనల్‌మేనేజరు విజయభారత్‌రెడ్డి, డీఎ్‌ఫవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 01:25 AM