Share News

రేపు తిరుపతి జిల్లాస్థాయి ప్రతిభా పురస్కారాలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:16 AM

తిరుపతిలోని పద్మావతి వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 2గంటలకు జిల్లాస్థాయి ఉత్తమ విద్యార్థులకు (టెన్త్‌, ఇంటర్‌) షైనింగ్‌ స్టార్స్‌ పేరిట ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరగనుంది.

రేపు తిరుపతి జిల్లాస్థాయి ప్రతిభా పురస్కారాలు

షైనింగ్‌ స్టార్స్‌కి ఇంటర్‌లో 44 మంది, టెన్త్‌లో 217 మంది ఎంపిక

తిరుపతి రూరల్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి):తిరుపతిలోని పద్మావతి వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 2గంటలకు జిల్లాస్థాయి ఉత్తమ విద్యార్థులకు (టెన్త్‌, ఇంటర్‌) షైనింగ్‌ స్టార్స్‌ పేరిట ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరగనుంది. గతేడాదిలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో వివిధ కేటగిరీల్లో ప్రతిభచాటిన మొత్తం 258మంది విద్యార్థులకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. జిల్లావ్యాప్తంగా టెన్త్‌లో 214మంది, ఇంటర్‌లో 44మంది విద్యార్థులకు కలిపి మొత్తంగా 258మంది విద్యార్థులను పురస్కారాలకు ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ హాజరై పురస్కారాలు అందజేస్తారని డీఈవో కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. ఇంటర్‌లో షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపికైన 44మంది విద్యార్థుల్లో ఏడుగురు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులున్నారని డీఐఈవో డాక్టర్‌ డి.గోపాల రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి సోమవారం ఉదయం 11గంటలకు పద్మావతి వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వద్దకు చేరుకోవాలని సూచించారు.

Updated Date - Jul 19 , 2026 | 01:16 AM