తిరుపతి బస్టాండు కిటకిట
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:29 AM
వరుస సెలవుల నేపథ్యంలో తిరుపతి సెంట్రల్ బస్టాండు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రయాణికులతో కిటకిటలాడింది.ప్రధానంగా విద్యార్థులు ఇంటిదారి పట్టడంతో పశ్చిమ మండలాల ప్లాట్‌ఫామ్స్ కిక్కిరిశాయి.
తిరుపతి అర్బన్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల నేపథ్యంలో తిరుపతి సెంట్రల్ బస్టాండు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రయాణికులతో కిటకిటలాడింది.ప్రధానంగా విద్యార్థులు ఇంటిదారి పట్టడంతో పశ్చిమ మండలాల ప్లాట్‌ఫామ్స్ కిక్కిరిశాయి.కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుమల బస్టాండ్లలో కూడా రద్దీ అమాంతంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో నిరీక్షణ తప్పలేదు. వచ్చిన బస్సులను వెంబడిస్తూ సీట్లకోసం పోటీపడ్డారు.బస్సుల వద్ద గుంపుగా ఎగబడడంతో వృద్ధులు, చిన్నారులు నలిగిపోయారు.ఇదే అదునుగా భావించి దొంగలు రెచ్చిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు.విద్యుత్ బస్సులు వస్తున్నాయంటూ కొత్త బస్సుల రాకను ఆపేయడంతోనే ఈ సమస్య తరచూ వెంటాడుతోందని బస్టాండు అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. రైల్వేస్టేషన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలతో పాటు వంతెనలు కూడా కిక్కిరిసి కన్పించాయి.