Share News

తిరుచానూరు టూరిస్టు బస్టాండు వేలం

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:25 AM

తిరుచానూరు పంచాయతీ ప్రైవేటు టూరిస్టు బస్టాండు వేలంపాటలో రూ.3.15కోట్లు పలికింది.

తిరుచానూరు టూరిస్టు బస్టాండు వేలం

తిరుచానూరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పంచాయతీ ప్రైవేటు టూరిస్టు బస్టాండు వేలంపాటలో రూ.3.15కోట్లు పలికింది. డీఎల్‌పీవో సురేష్‌నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో దయాసాగర్‌, పంచాయతీ కార్యదర్శి మణి ఆధ్వర్యంలో సోమవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ టూరిస్టు బస్టాండుకు వేలం పాట నిర్వహించారు. కిరణ్‌రెడ్డి అనే వ్యక్తి రూ.3.15,40,000కు దక్కించుకున్నాడు. గత నెల 31వ తేదీతో టూరిస్టు బస్టాండు రుసుం వసూలు హక్కు గడువు ముగిసింది. ఈనెల 1నుంచి పంచాయతీ అధికారులే పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం వేలం నిర్వహించారు. ఈనెల 20 తరువాత కాంట్రాక్టర్‌కు టూరిస్టు బస్టాండు అప్పగిస్తామని, వారికి 11 నెలలు మాత్రమే రుసుం వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని డీఎల్‌పీవో తెలిపారు. కాగా, గత ఏడాది తిరుచానూరు టూరిస్టు బస్టాండు వేలం ద్వారా రూ.3.50కోట్లు పంచాయతీకి ఆదాయం వచ్చింది.

Updated Date - Apr 14 , 2026 | 01:25 AM