Share News

ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:27 AM

ఎర్రచందనం రవాణా కేసులో ముగ్గురికి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రీకాంత్‌ సోమవారం తీర్పు చెప్పారు.

ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు
నిందితులను జైలుకు తరలిస్తున్న పోలీసులు

తిరుపతి(లీగల్‌),ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం రవాణా కేసులో ముగ్గురికి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శ్రీకాంత్‌ సోమవారం తీర్పు చెప్పారు. పిచ్చాటూరు మండలానికి చెందిన భూతల వెంకటాచలం, గోపాలరెడ్డి శంకర్‌, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన షేక్‌షకీర్‌ ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. విచారణలో నేరం నిరూపితం కావడంతో ముగ్గురు నిందితులకు జైలు శిక్ష విధించారు.

Updated Date - Apr 14 , 2026 | 01:27 AM