Share News

ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:57 AM

ఎర్రచందనం కేసులో తిరుపతి ప్రత్యేక ఎర్రచందనం కోర్టులో శనివారం ముగ్గురు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌ తెలిపారు.

ఎర్రచందనం కేసులో ముగ్గురికి జైలు

14పీజీఆర్‌ఆర్‌సిఎల్‌1: నిందితులతో పోలీసులు

రొంపిచెర్ల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం కేసులో తిరుపతి ప్రత్యేక ఎర్రచందనం కోర్టులో శనివారం ముగ్గురు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌ తెలిపారు. వివరాలివి..2014 నవంబరులో రొంపిచెర్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందన దుంగలు అక్రమ మార్గంలో రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారు. నిందితులు పీలేరుకు చెందిన కంభం తేజ ప్రకా్‌షరెడ్డి, కలవపల్లిగురునాథ్‌, చిట్టమూరి శివకుమార్‌ లకు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల వంతున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలలు జైలు శిక్ష ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 01:58 AM