స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు మూడంచెలు.. కొత్త హంగులు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:55 AM
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వంమూడంచెల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని 27 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో 444 స్వర్ణ గ్రామ, 92 వార్డు కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 3600 మంది విఽధులు నిర్వహిస్తున్నారు. వీటిని జనాభా ఆధారంగా గ్రామ, వార్డు కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి సేవలందించేందుకు 6-10 మంది చొప్పున ఉద్యోగులు ఉండేలా సర్దుబాటు చేశారు. జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో ఈ కార్యాయాల పర్యవేక్షణకు డిప్యుటేషన్‌పై ఇతర ప్రభుత్వ శాఖల నుంచి 24 మంది అధికారులను నియమించింది. వారికి సంబంధించిన నిధులు, బాధ్యతలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వంమూడంచెల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని 27 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో 444 స్వర్ణ గ్రామ, 92 వార్డు కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 3600 మంది విఽధులు నిర్వహిస్తున్నారు. వీటిని జనాభా ఆధారంగా గ్రామ, వార్డు కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి సేవలందించేందుకు 6-10 మంది చొప్పున ఉద్యోగులు ఉండేలా సర్దుబాటు చేశారు. జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో ఈ కార్యాయాల పర్యవేక్షణకు డిప్యుటేషన్‌పై ఇతర ప్రభుత్వ శాఖల నుంచి 24 మంది అధికారులను నియమించింది. వారికి సంబంధించిన నిధులు, బాధ్యతలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
జిల్లా స్థాయిలో విధులు
జిల్లాలోని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలను పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగించారు. ప్రజలకు నిర్దేశిత కాల వ్యవధిలో సేవలందించేలా చూడాలి. కార్యాలయాలు తనిఖీ చేసి లోపాలు సరిదిద్దాల్సి ఉంది. హెచ్‌ఆర్‌ఎంఎ్‌స పోర్టల్‌లో ఉద్యోగుల బయోమెట్రిక్ నమోదు చేయాలి. ప్రజలకు అందించే సేవలపై వసూలు చేసే రుసుం అదే రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మరుసటి రోజు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఉద్యోగులపై ఫిర్యాదులు, అక్రమాలపై విచారించి క్రమశిక్షణ చర్యలకు కలెక్టర్, రాష్ట్ర స్వర్ణ గ్రామ, వార్డు శాఖలకు నివేదికలు పంపి వారి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాలి.
మండల, మున్సిపాలిటీ పరిధిలో ...
మండల, మున్సిపాలిటీ స్థాయి పర్యవేక్షణ అధికారులు ఆయా కార్యాలయాల్లో మౌలిక వసతులపరంగా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఆధార్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలి. ప్రతి ఆరు నెలలకు ఒక ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేయాలి. ప్రతి పౌరుడు ఆధార్ నమోదు చేసుకునేలా చూడాలి. ఆధార్ ప్రత్యేక శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడాలి.
ఫ కంప్యూటర్లు, ప్రింటర్లకు నిధులు విడుదల
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన కంప్యూటర్, ప్రింటర్లు పాడై మూలన చేరాయి. ప్రజలకు మరిన్ని న్యాయమైన సేవలందించేందుకు పాడైన కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎ్‌సల స్థానంలో కొత్తవి సమకూర్చేందుకు రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షల మేరకు ప్రభుత్వం త్వరలో నిధులను మంజూరు చేయనుంది. దీనికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నెల మొదటి వారంలో కంప్యూటర్ సామగ్రిని అందజేయనున్నారు. దీంతో పాటు కార్యాలయాల్లో ఇంటర్నెట్, స్టేషనరీ సదుపాయం కల్పించేందుకు ఒక్కో కార్యాలయానికి నెలకు రూ.వెయ్యి వరకు కేటాయించనున్నారు.
మరింత నాణ్యమైన పౌర సేవలు
ఇప్పటికే పలు స్వర్ణ, గ్రామ కార్యాలయాలకు కొత్త ప్రింటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పాటు ఆన్‌లైన్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇకనుంచి నిరంతరం సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ ఉంటుంది. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో మెరుగైన పౌర సేవలు అందుతాయి.
- రవికుమార్, కో- ఆర్డినేటర్, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, చిత్తూరు