Share News

ఈ ఏడాదే ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

ABN , Publish Date - May 24 , 2026 | 02:13 AM

ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకొచ్చాం. ఈ ఏడాది ‘నీవా’ వరకు నీటిని తీసుకొచ్చి పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యాదమరిలో శనివారం జరిగిన ‘సంజీవని ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుమల వెంకన్న వరకు నీటిని తరలిస్తామన్నారు. ‘శ్రీశైలం నుంచి కల్యాణి డ్యాంకు నీటిని తీసుకొచ్చి ఆలయాలను అనుసంధానం చేస్తాం. గాలేరు నగరిని కోడూరు వరకు తీసుకొస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 2028 జూన్‌కు.. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను అదే సంవత్సరం డిసెంబరుకు పూర్తి చేస్తాం. ప్రాజెక్టుల పూర్తికి అధికార అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడిక్కడ నీటిని సమర్థంగా ఉపయోగించి భూగర్భ జలాలు పెంచారు. తద్వారా 8.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రయోగం చేశాక రాష్ట్రమంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం సుందరమైన వాతావరణం ఉంది. తక్కువ ఎండ ఉండేది చిత్తూరు జిల్లానే. భూమినే జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

ఈ ఏడాదే   ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

  • శ్రీశైలం నుంచి కల్యాణిడ్యామ్‌కు జలాలు

  • 2028 డిసెంబరుకు బాలాజీ, మల్లెమడుగు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం

  • ‘సంజీవని’ ప్రజావేదికలో సీఎం చంద్రబాబు వెల్లడి

యాదమరి, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకొచ్చాం. ఈ ఏడాది ‘నీవా’ వరకు నీటిని తీసుకొచ్చి పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యాదమరిలో శనివారం జరిగిన ‘సంజీవని ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుమల వెంకన్న వరకు నీటిని తరలిస్తామన్నారు. ‘శ్రీశైలం నుంచి కల్యాణి డ్యాంకు నీటిని తీసుకొచ్చి ఆలయాలను అనుసంధానం చేస్తాం. గాలేరు నగరిని కోడూరు వరకు తీసుకొస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 2028 జూన్‌కు.. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను అదే సంవత్సరం డిసెంబరుకు పూర్తి చేస్తాం. ప్రాజెక్టుల పూర్తికి అధికార అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడిక్కడ నీటిని సమర్థంగా ఉపయోగించి భూగర్భ జలాలు పెంచారు. తద్వారా 8.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రయోగం చేశాక రాష్ట్రమంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం సుందరమైన వాతావరణం ఉంది. తక్కువ ఎండ ఉండేది చిత్తూరు జిల్లానే. భూమినే జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

ఆ కిక్కే వేరు

‘టీడీపీ.. నాకు ప్రాణసమానమైన కుటుంబ సభ్యులు. సీఎం అయ్యాక అధికార యంత్రాంగం నాకు రెండో టీమ్‌. అధికారులు బాగా పనిచేస్తే వాళ్లకు దండ వేస్తా. లేకుంటే నేను వాళ్లకు దగ్గరగా ఉండను. బాగా పనిచేసిన అధికారులకు చప్పట్లు కొడితే కిక్కు ఎక్కి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. నేను ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాను. నాపై ఎంతో అభిమానం చూపించారు. ఈ కిక్కే వేరు’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వీరు భేష్‌

చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతంలో తాగునీరు (పంచాయతీరాజ్‌), ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్‌ హాస్టళ్లు, అన్నా క్యాంటీన్‌, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం, సీఎం రిలీఫ్‌ ఫండ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, శానిటేషన్‌, మున్సిపల్‌ పరిపాలన విభాగం అధికారులు బాగా పనిచేశారంటూ ప్రశంసించారు.

వీరి పనితీరు మారాలి

‘సివిల్‌ సప్లయిస్‌ విభాగం సరిగ్గా పనిచేయట్లేదు. అక్కడ రేషన్‌ దుకాణాల్లో ఏమైనా రీసైక్లింగ్‌ ఉందా’ అని అధికారిని చంద్రబాబు ప్రశ్నించారు. రీసర్వే, ఆర్‌వోఆర్‌ సక్రమంగా లేదన్నారు. వైసీపీ హయాంలో ప్రజల ఆస్తిని 22ఏ కింద పెట్టి రికార్డులు అస్తవ్యస్తం చేశారన్నారు. ఎంతో అనుభవం ఉన్న తనకే అర్థంకాలేదన్నారు. ఇప్పుడు సాంకేతికతను జోడించి బ్యాక్‌చెయిన్‌ విధానం తీసుకొచ్చామన్నారు. అరసెంటు స్థలం కోసం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయన్నారు. గొడ్డలి పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దన్నారు. ఇక, పాఠశాల విద్య, ఆర్టీసీ బస్సులు, బస్టాండు, వాహన రిజిస్ర్టేషన్‌, విద్యుత్తు, దేవదాయశాఖ, రిజిస్ర్టేషన్లు, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు, రహదారుల గుంతలు (ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌), పంచాయతీరాజ్‌ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి విభాగాల పనితీరు రాష్ట్రస్థాయి కంటే తక్కువగా ఉందని వివరించారు. పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి గతంలో తక్కువలో ఉన్నామని, ఈసారి నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయని సంబంధిత అఽధికారి పేర్కొన్నారు. కాణిపాకం, కుప్పం, డీపీఆర్‌సీకి అవార్డులు వచ్చాయని, ఇందులో రెండు తన నియోజకవర్గంలోనే ఉన్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే మురళి సీఎంకు వివరించారు. మరోవైపు అగ్నిమాపకశాఖ పనితీరు సరిగ్గాలేదన్నారు. గంజాయి, మహిళలపై నేరాలను అరికట్టాలని ఎస్పీకి సీఎం సూచించారు.

మీరు సమీక్షించారా?

‘పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో 33 సేవలు బిలో యావరేజ్‌.. 19 సేవలు అబౌ యావరేజ్‌. ప్రజలకు అందే సేవలను మెరుగుపరచుకోవాలి. మీరు వీటిపై సమీక్ష నిర్వహించారా’ అంటూ నోడల్‌ అధికారిని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ విధంగా మెరుగుపర్చుకుంటారని అడిగారు. కొన్ని మాత్రమే చేశామని సమాధానం ఇవ్వగా, నోడల్‌ అఽధికారిగా చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.

Updated Date - May 24 , 2026 | 02:13 AM