Share News

ఈ రోబో రైతుమిత్ర

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:00 AM

ఆధునిక సాంకేతికత ప్రవేశంతో రైతు పని సులభరతరమవుతోంది. ఇప్పటికే వ్యవసాయలో డ్రోన్లు ఇతోధికంగా సాయపడుతున్నాయి. కూలీల కొరత సమస్యను అధిగమించేలా చేస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా రోబో అడుగుపెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. కూలీలు, ఖర్చులను తగ్గించడంలో కీలకపాత్ర పోషించనుంది. దేశీయంగా రూపొందిన ఈ బహుళ ప్రయోజనకారికి రోజుకోసారి బ్యాటరీ చార్జ్‌ చేస్తే 3నుంచి 5 గంటలపాటు సేవలందిస్తుంది. రోటావేటర్‌, బ్లేడ్‌, నాగలి, బూమ్‌ స్ర్పేయర్‌, మిస్ట్‌ బ్లోవర్‌లను ఇముడ్చుకున్న ఈ రోబో రోజుకు 40 నుంచి 50 మంది కూలీల పని చేయగలదు. స్ర్పేయర్‌తో మందులను పిచికారి చేస్తుంది. 30 నుంచి 40 శాతం వరకు కెమికల్స్‌ వృథాను అరికడుతుంది. డీజిల్‌ అవసరంలేదు. దీంతో కర్బన్‌ ఉద్గారాలూ తగ్గుతాయి.రైల్వేకోడూరు మండలం ఎస్‌ఆర్‌ కండ్రిగకు చెందిన వెంకట్రామరాజు పొలంలో శనివారం ఈ రోబోతో వ్యవసాయశాఖ అధికారి సందీప్‌ ప్రయోగాత్మకంగా పిచికారి చేసే విధానాన్ని రైతులకు వివరించారు.

ఈ రోబో రైతుమిత్ర
పొలంలో పిచికారి చేస్తున్న రోబో

  • కూలీలు, ఖర్చులు భారీగా తగ్గే అవకాశం

రైల్వేకోడూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతికత ప్రవేశంతో రైతు పని సులభరతరమవుతోంది. ఇప్పటికే వ్యవసాయలో డ్రోన్లు ఇతోధికంగా సాయపడుతున్నాయి. కూలీల కొరత సమస్యను అధిగమించేలా చేస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా రోబో అడుగుపెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. కూలీలు, ఖర్చులను తగ్గించడంలో కీలకపాత్ర పోషించనుంది. దేశీయంగా రూపొందిన ఈ బహుళ ప్రయోజనకారికి రోజుకోసారి బ్యాటరీ చార్జ్‌ చేస్తే 3నుంచి 5 గంటలపాటు సేవలందిస్తుంది. రోటావేటర్‌, బ్లేడ్‌, నాగలి, బూమ్‌ స్ర్పేయర్‌, మిస్ట్‌ బ్లోవర్‌లను ఇముడ్చుకున్న ఈ రోబో రోజుకు 40 నుంచి 50 మంది కూలీల పని చేయగలదు. స్ర్పేయర్‌తో మందులను పిచికారి చేస్తుంది. 30 నుంచి 40 శాతం వరకు కెమికల్స్‌ వృథాను అరికడుతుంది. డీజిల్‌ అవసరంలేదు. దీంతో కర్బన్‌ ఉద్గారాలూ తగ్గుతాయి.రైల్వేకోడూరు మండలం ఎస్‌ఆర్‌ కండ్రిగకు చెందిన వెంకట్రామరాజు పొలంలో శనివారం ఈ రోబోతో వ్యవసాయశాఖ అధికారి సందీప్‌ ప్రయోగాత్మకంగా పిచికారి చేసే విధానాన్ని రైతులకు వివరించారు.

Updated Date - Jan 25 , 2026 | 02:00 AM