వరసిద్ధుడికోసం ఈ మగ్గం
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:27 AM
వరసిద్ధుడి కోసం మగ్గం ఏర్పాటు చేయడం ఏంటని అనుకుంటున్నారా?
వరసిద్ధుడి కోసం మగ్గం ఏర్పాటు చేయడం ఏంటని అనుకుంటున్నారా? సాధారణంగా కాణిపాక వినాయకుడి బ్రహ్మోత్సవాల్లో స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం సంప్రదాయం. దీనికోసం దుకాణాలలో కొనుగోలు చేసేవారు. ఈసారి ఆలయ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సంప్రదాయబద్ధంగా నియమనిష్టలతో నేసి సమర్పించాలని అనుకున్నారు. దీనికోసం ఆలయ వసతి గృహంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మగ్గాన్ని బుధవారం ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు ప్రారంభించారు. హైదరాబాదుకు చెందిన అఖిల భారత చేనేత కళా వైభవం చైర్మన్ ఎస్‌ఎస్ జయరాజు ఈ పట్టు వస్త్రాన్ని నేసి స్వామికి సమర్పించాలన్న సంకల్పంతో మగ్గాన్ని ఏర్పాటు చేశారు. నియమ నిష్టలతో ఈ పట్టువస్త్రాన్ని నేయనున్నారు. ఈ మగ్గం ప్రారంభోత్సవంలో బోర్డు సభ్యులు శ్రీపతిసతీష్, చంద్రశేఖర్‌రెడ్డి, చేనేత వస్త్రం సంఘం సభ్యులు ఆనంద్, సుదర్శన్‌రెడ్డి, సురేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి