దిస్ ఈజ్ అమెజింగ్
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:26 AM
‘ఇండియా ఈస్ గ్రేట్ కంట్రీ.. దిస్ ఈస్ అమెజింగ్’ అంటూ ఓ విదేశీ భక్తుడు శ్రీవారి అన్నప్రసాదాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 ఏళ్లలోపు వయస్సున్న ఓ విదేశీ ఫుడ్ వ్లాగర్ ఇటీవల తిరుమల వచ్చారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అల్పాహారం స్వీకరించి తన అనుభవాన్ని ‘ది ఫుడ్ వైబ్ ఇండియా’ అనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల ద్వారా వ్యక్తపరిచారు.
- శ్రీవారి అన్నప్రసాదాలపై విదేశీ భక్తుడి ప్రశంస
‘ఇండియా ఈస్ గ్రేట్ కంట్రీ.. దిస్ ఈస్ అమెజింగ్’ అంటూ ఓ విదేశీ భక్తుడు శ్రీవారి అన్నప్రసాదాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 30 ఏళ్లలోపు వయస్సున్న ఓ విదేశీ ఫుడ్ వ్లాగర్ ఇటీవల తిరుమల వచ్చారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అల్పాహారం స్వీకరించి తన అనుభవాన్ని ‘ది ఫుడ్ వైబ్ ఇండియా’ అనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల ద్వారా వ్యక్తపరిచారు. ‘తిరుమలలో ఉన్న అన్నప్రసాదం సెంటర్‌లో ప్రతి రోజు లక్షమందికి అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు. చెప్పులతో లోపలకు అనుమతించరు. డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉంది. పొంగల్, చట్నీ, సాంబారు వడ్డించారు. ఇది బెస్ట్ సాంబారని చెప్పవచ్చు. ఒకేసారి 4 వేల మంది తినచ్చు. ఐ థింక్ దిస్ షోస్ ఇండియా ఈస్ గ్రేట్ కంట్రీ. దిస్ ఈస్ అమెజింగ్. ఇది చాలా బాగుంది(తెలుగులో చెప్తూ)’ అని మాట్లాడారు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేయగా ఏకంగా 3.7 మిలియన్ వ్యూస్, 4.49 లక్షల లైక్స్ రావడం గమనార్హం. విదేశీయుడు ఇలా స్వామివారి ప్రసాదాన్ని కొనియాడుతున్న వీడియోపై నెటిజన్లు భారీగా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి