Share News

పండక్కు ఫుల్‌గా తాగేశారు!

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:54 AM

సంక్రాంతి పండుగవేళ జిల్లాలో మద్యం ఏరులై పారింది. పండుగ సంబరాలు, కోడి పందేల జోరుతో మందుబాబులు రికార్డు స్థాయిలో మద్యాన్ని వినియోగించారు.

పండక్కు ఫుల్‌గా తాగేశారు!

మూడు రోజుల్లో రూ.13 కోట్ల మద్యం వినియోగం

చిత్తూరు సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగవేళ జిల్లాలో మద్యం ఏరులై పారింది. పండుగ సంబరాలు, కోడి పందేల జోరుతో మందుబాబులు రికార్డు స్థాయిలో మద్యాన్ని వినియోగించారు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఏకంగా రూ.13 కోట్ల విలువచేసే మద్యం తాగేశారు.జిల్లాలో 123 మద్యం దుకాణాలు , 8 బార్‌లు వుండగా సాధారణ రోజుల కంటే రెంట్టింపు మద్యం అమ్మకాలు జరిగాయి. పల్లెలో సంక్రాంతి సందడికి తోడు పట్టణాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూళ్ళకు తరలి రావడంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. గతంలో కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలించేవారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే తక్కువ ధరకు మద్యం లభిస్తుండటంతో స్థానికంగా విక్రయాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలను సీసాకు రూ.10 చొప్పున పెంచినప్పటికీ అమ్మకాలపై దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. మూడు రోజుల్లో 13,716 కేసుల బీర్లు, ఐఎంఎల్‌ 16,437 కేసులు అమ్ముడయ్యాయి.

Updated Date - Jan 20 , 2026 | 12:54 AM