ఈ అధికారులు మాకొద్దు
ABN , Publish Date - May 14 , 2026 | 12:14 AM
ప్రజలకు అందుబాటులో లేని అధికారులు తమకు వద్దంటూ కూటమి పార్టీల నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
పుంగనూరు, మే13(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటులో లేని అధికారులు తమకు వద్దంటూ కూటమి పార్టీల నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమకు అధికారులు విలువ ఇవ్వడంలేదని, ప్రజల సమస్యలు తీర్చలేక బయట చెప్పుకోవాలంటే అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 11.30 గంటలకు కూడా అధికారులు రావడంలేదన్నారు. ఎంపీడీవో వారంలో రెండు రోజులు కార్యాలయంలో ఉంటూ మిగిలిన రోజుల్లో సొంతూరికి వెళ్లడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ అందుబాటులో ఉన్నా కిందస్థాయి అధికారులు ఆయన ఆదేశాలు పట్టించుకోలేదన్నారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, జనసేన నాయకులు విరూపాక్షి, చైతన్యరాయల్, బీజేపీ నాయకులు నానబాలకుమార్, నరసింహులు, కూటమి నేతలు రామకృష్ణనాయక్ రాంబాబు, వెంకటరమణ, రమణ, మాదవ, గంగాధర్, హరినాయక్, హరి పాల్గొన్నారు.