Share News

పురాధీశులు వీరే

ABN , Publish Date - Nov 20 , 2026 | 02:54 AM

చిత్తూరు జిల్లాలో గురువారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఒక చిన్నపాటి వివాదం కూడా తలెత్తకుండా సాఫీగా జరిగిపోయాయి. మొత్తం 27 మండల పరిషత్‌లకు గానూ టీడీపీ 24 ఎంపీపీ పదవులను గెలుచుకోగా వైసీపీ కేవలం మూడు ఎంపీపీ పదవులకే పరిమితమైంది. వైస్‌ ఎంపీపీ పదవుల విషయాకినొస్తే టీడీపీ 22, జనసేన 2, వైసీపీ 3 చొప్పున గెలుచుకున్నాయి.

పురాధీశులు వీరే

చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు

27 మండల పరిషత్‌లలో టీడీపీకి 24... వైసీపీకి 3

వైస్‌ ఎంపీపీ పదవుల్లో టీడీపీకి 22... జనసేనకు 2... వైసీపీకి 3

పది మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు మహిళలే!

తిరుపతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో గురువారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఒక చిన్నపాటి వివాదం కూడా తలెత్తకుండా సాఫీగా జరిగిపోయాయి. మొత్తం 27 మండల పరిషత్‌లకు గానూ టీడీపీ 24 ఎంపీపీ పదవులను గెలుచుకోగా వైసీపీ కేవలం మూడు ఎంపీపీ పదవులకే పరిమితమైంది. వైస్‌ ఎంపీపీ పదవుల విషయాకినొస్తే టీడీపీ 22, జనసేన 2, వైసీపీ 3 చొప్పున గెలుచుకున్నాయి. పది మండలాల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు రెండూ మహిళలే గెలుచుకోవడం విశేషం. నియోజకవర్గాల వారీగా చూస్తే కుప్పంలో నాలుగుకు నాలుగూ, పలమనేరులో ఐదింటికి ఐదూ, పూతలపట్టులో ఐదింటికి ఐదు, చిత్తూరులో రెండింటికి రెండూ, నగరిలో మూడింటికి మూడూ చొప్పున అన్ని మండల పరిషత్‌లనూ టీడీపీ స్వీప్‌ చేసి ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. ఒక్క జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మాత్రమే ఆరు మండల పరిషత్‌లకు గానూ మూడు గెలిచి మూడింటిని కోల్పోయింది. వైసీపీ పరంగా చూస్తే జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో తుడిచిపెట్టుకుపోయింది. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మూడు మండల పరిషత్‌లను మాత్రమే దక్కించుకుని ఉనికి కాపాడుకుంది. కాగా జిల్లాలోని గుడుపల్లి, శాంతిపురం, వి.కోట, బైరెడ్డిపల్లి, పులిచెర్ల, పాలసముద్రం, నిండ్ర, విజయపురం, గుడిపాల, పెనుమూరు తదితర పది మండలాల్లో అటు ఎంపీపీ, ఇటు వైస్‌ ఎంపీపీ పదవులు రెండింటినీ మహిళలే గెలిచి ఆ మండలాల్లో మహిళా ప్రతినిధుల పెత్తనం నెలకొల్పారు.

మండలం ఎంపీపీ పార్టీ వైస్‌ ఎంపీపీ పార్టీ

------------------------------------------------------------------------------------------------------------------------

కుప్పం ధనశేఖర్‌ టీడీపీ కోకిల టీడీపీ

రామకుప్పం వెంకట్రమణ టీడీపీ పట్ర నారాయణాచారి టీడీపీ

గుడుపల్లి మీనాక్షి టీడీపీ దేవి టీడీపీ

శాంతిపురం మంజుల టీడీపీ శాలిని టీడీపీ

వి.కోట సులోచన టీడీపీ లావణ్య టీడీపీ

బైరెడ్డిపల్లి రాధమ్మ టీడీపీ ప్రమీల టీడీపీ

పలమనేరు భువనేశ్వరి టీడీపీ వెంకట్రమణ టీడీపీ

పెద్దపంజాణి అశ్విని టీడీపీ ఆనంద టీడీపీ

బంగారుపాలెం సుజాత టీడీపీ రమేష్‌ టీడీపీ

యాదమరి సుభా్‌షనాయుడు టీడీపీ లావణ్య టీడీపీ

చిత్తూరు రూరల్‌ జయచంద్రనాయుడు టీడీపీ లావణ్య టీడీపీ

తవణంపల్లి సుమిత్ర టీడీపీ పరంధామనాయుడు టీడీపీ

ఐరాల దేవాజీ టీడీపీ చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ

పూతలపట్టు గంగారపు గోపి టీడీపీ దొరబాబు చౌదరి టీడీపీ

రొంపిచెర్ల చల్లా సుప్రియ టీడీపీ ఇమ్రాన్‌ ఖాన్‌ టీడీపీ

పులిచెర్ల బేబీ చౌదరి టీడీపీ భారతి టీడీపీ

జీడీనెల్లూరు వినోద్‌ నాయుడు టీడీపీ శ్రీధర్‌ యాదవ్‌ టీడీపీ

పాలసముద్రం భానుప్రియ టీడీపీ దుర్గ టీడీపీ

కార్వేటినగరం నిధి టీడీపీ కర్పగం టీడీపీ

నిండ్ర మాలతి టీడీపీ సుమతి టీడీపీ

విజయపురం జ్యోతి టీడీపీ కల్పన టీడీపీ

నగరి దేవి టీడీపీ దీనదయాళ్‌ నాయుడు టీడీపీ

గంగవరం శుభావతి టీడీపీ పవన్‌ కుమార్‌ జనసేన

గుడిపాల భారతి టీడీపీ రాణి జనసేన

పెనుమూరు అనూష వైసీపీ శిల్ప వైసీపీ

ఎస్‌ఆర్‌పురం భారతి వైసీపీ మురళి వైసీసీ

వెదురుకుప్పం వెంకటేశులు వైసీపీ సుబ్రమణ్యంరెడ్డి వైసీపీ

-----------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Nov 20 , 2026 | 02:54 AM