చిరుతలు తిరుగుతున్నాయంటూ ఎగుమాసాపల్లెలో దండోరా
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:27 AM
‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడమేమంటే.. గ్రామ సమీపంలో చిరుతలు తిరుగుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండండి’ అంటూ చిత్తూరు శివారు ఎగువమాసాపల్లెలో మంగళవారం అటవీశాఖ అధికారులు దండోరా వేయించారు.
‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడమేమంటే.. గ్రామ సమీపంలో చిరుతలు తిరుగుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండండి’ అంటూ చిత్తూరు శివారు ఎగువమాసాపల్లెలో మంగళవారం అటవీశాఖ అధికారులు దండోరా వేయించారు. ఇక్కడ చిరుతల సంచారంపై సోమవారం స్థానికులు సమాచారమిచ్చారు. సోమవారం రాత్రి డ్రోన్ ద్వారా రెండు చిరుతల సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎగువమాసాపల్లి, బీడీరెడ్డి పరివాహక ప్రాంతాలు, ఎస్టేట్, ఠానా, దిగువమాసాపల్లి వరకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, తిరిగి సాయంతం నుంచి రాత్రి వరకు రెండు బృందాలు చిరుతల సంచారంపై నిఘా పెట్టారు. మరో వైపు బండపల్లి, జీకేపురం, చెన్నమ్మగుడిపల్లి ప్రాంతంలోనూ మరో బృందం చిరుతల సంచారంపై నిఘా పెట్టింది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఎవరూ పొలాల్లోకి వెళ్లరాదని అటవీ శాఖ తూర్పు డివిజన్ డీఎ్‌ఫవో థామస్ కుమార్ సూచించారు. పశువులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లరాదన్నారు. ఎఫ్‌ఆర్వో వెంట ఎఫ్‌బీవో మణికుమారి, మధు, గౌస్‌బాషా, ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌ఎ్‌సవో చండీకుమార్, హరిప్రియ సిబ్బంది ఉన్నారు.
- చిత్తూరు సెంట్రల్, ఆంధ్రజ్యోతి