అక్కడ ఆయప్పదే ‘రాజ్యం’
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:15 AM
ఉర్లవోబనపల్లెలో పేర్లు మారుతున్న భూములు లబోదిబోమంటున్న వాస్తవ హక్కుదారులు
కుప్పం, ఆంధ్రజ్యోతి: మండల కేంద్రమైన కుప్పానికి సమీపంలో ఉంది ఉర్లవోబనపల్లె గ్రామం. ఓ వ్యక్తి రెవెన్యూ శాఖలో చిరుద్యోగిగా పని చేస్తున్నారు. ఉద్యోగం చిన్నదే కానీ, ఆయప్ప మీద గ్రామస్తుల ఆరోపణలు పెద్దగా ఉంటున్నాయి. గ్రామంలో భూములన్నింటినీ అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలన్న అత్యాశతో ఆ ఉద్యోగి ఒకరి భూములను అన్యాయంగా మరొకరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు మల్లప్ప, మంజునాథ్ అనే అన్నదమ్ములు తమ భూమి ఇలానే వేరొకరి పేరుమీద రిజిస్టర్ అయిపోయిందని వాపోతున్నారు. అన్నదమ్ముల వాదన ప్రకారం.. ఉర్లవోబనపల్లెలో సర్వే నెంబరు 25/3లో 64 సెంట్ల భూమి తాత ద్వారా వీరికి వారసత్వ ఆస్తిగా సంక్రమించింది. తరతరాలుగా ఈ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఇటీవల పొలం దున్నుతున్న సమయంలో బాబు అనే గ్రామస్తుడు కుటుంబ సభ్యులతో కలిసివచ్చి వారిని అడ్డుకున్నారు. తమ భూమిలో ఎందుకు దున్నుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాతలకాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూమి మీదెలా అవుతుందని మల్లప్ప నిలదీశారు. తన పేరుమీద రిజిస్ట్రేషన్ అయిన సదరు భూమి వివరాలను బాబు వారికి చూపడంతో షాక్‌కు గురయ్యారు. ఇదే 25/3 సర్వే నెంబరులోని 64 సెంట్ల భూమి ఆన్‌లైన్‌లో బాబు అనే వ్యక్తి పేరుమీద ఉన్నట్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇదెలా జరిగిందో అర్థంకాని మల్లప్ప, మంజునాథ్ చివరకు గ్రామానికే చెందిన రెవెన్యూ చిరుద్యోగి చేసిన మాయాజాలంగా తేల్చుకున్నారు. ఈ ఇద్దరివే కాదు.. చాలామంది గ్రామస్తుల భూములు ఇలానే వారికి తెలియకుండా ఇతరుల పేరుమీద రిజిస్ట్రేషన్ అయిపోయాయని, ఈ దందాలన్నింటిలో ఆ ఉద్యోగి హస్తమున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ భూములను తమకు తెలియకుండా పేరుమార్చి బాబు అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ చేసేశారని, దానికి రెవెన్యూ చిరుద్యోగి సహకరించారని బాధితులు మల్లప్ప, మంజునాథ్‌లు ఆర్డీవోకు, తహశీల్దారుకు ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై తహశీల్దారు చిట్టిబాబును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా తనవద్దకు ఎటువవంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఒకవేళ అలా తప్పుడు భూ రిజిస్ట్రేషన్ జరిగివుంటే విచారించి హక్కుదారులకు తప్పకుండా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.