మా మధ్య ఎలాంటి విబేధాల్లేవు
ABN , Publish Date - May 04 , 2026 | 01:56 AM
తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం వీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చిన్నపాటి తగాదా, దాడిగా ప్రచారం జరిగిందని చెప్పారు. ఇది ఒక దురదృష్టకర సంఘటన అని, తమ ప్రమేయం లేకుండానే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే దుష్ప్రచారం జరిగిందని వివరించారు.
చిన్నపాటి వివాదం.. దాడిగా ప్రచారం జరిగింది
ఎంపీ దగ్గుమళ్ల, ఎమ్మెల్యే గురజాల వెల్లడి
చిత్తూరు సిటి, మే 3 (ఆంధ్రజ్యోతి): తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం వీరు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి చిన్నపాటి తగాదా, దాడిగా ప్రచారం జరిగిందని చెప్పారు. ఇది ఒక దురదృష్టకర సంఘటన అని, తమ ప్రమేయం లేకుండానే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే దుష్ప్రచారం జరిగిందని వివరించారు. వాస్తవంగా తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. గడచిన రెండేళ్లలో తాము చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలసికట్టుగా కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సారధ్యంలో అధికారులను, నాయకులను సమన్వయం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధి ముందుకు సాగుతోందని చెప్పారు. గత రెండేళ్లలో ఎక్కడా ఏ అధికారిని మార్చడం గాని, వేరే రకంగా ఇబ్బందులు పెట్టడంగానీ జరగలేదన్నారు. నగరపాలక సంస్థలో జరిగిన ఘటనలోనూ మాటల వివాదం కాస్త దాడిగా ప్రచారం జరిగిందని చెప్పారు. అందరూ పనిచేసేది ప్రజలకోసమేనని , అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. కాగా ఈ వివాదాలకు కారణమైన ఇరువర్గాలను విలేకరుల సమావేశంలో మాట్లాడించారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు, ఆర్పీలు, ఆ సంఘం నేతలు పాల్గొన్నారు.