పగటపూటే ఇంటికి తాళం పగులగొట్టి దొంగతనాలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:35 AM
అలా వెళ్తుంటారు. తాళం వేసిన ఇల్లు వీరికి కనిపిస్తే చాలు. పగటిపూటే తాళం పగలగొట్టి దొంగతనాలు చేస్తారు. ఇలా చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి రూ.27.80 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం బంగారుపాళ్యం పోలీసు స్టేషన్‌లో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.
ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
రూ.27.80 లక్షల సొత్తు స్వాధీనం
బంగారుపాళ్యం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): అలా వెళ్తుంటారు. తాళం వేసిన ఇల్లు వీరికి కనిపిస్తే చాలు. పగటిపూటే తాళం పగలగొట్టి దొంగతనాలు చేస్తారు. ఇలా చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి రూ.27.80 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం బంగారుపాళ్యం పోలీసు స్టేషన్‌లో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. పలమనేరు, బంగారుపాళ్యం మండలాల పరిసరాల్లో వరుసగా ఇంటి దొంగతనాలు జరిగేవి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందాలతో నిఘా పెట్టారు. శుక్రవారం పాలేరు సమీపంలోని ఫ్లైవోర్ వద్ద సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. వీరిని చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా, పగటి పూట తాళాలు వేసున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవారని అంగీకరించారు. వీరు బంగారుపాళ్యం మండలంలోని గౌరీపురం, వెలుతురుచేను, రాగిమానుపెంట.. పలమనేరు మండలంలోని కరిడిమడుగు, చిన్నకుంట, కాల్వపల్లె గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి రూ.24 లక్షల విలువ చేసే 181.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.80 వేల విలువ గల 307 గ్రాముల వెండి వస్తువులు, రూ.2.5 లక్షల విలువ చేసే సిఫ్ట్‌డిజైర్ కారు, రూ.50 విలువ చేసే స్కూటీని స్వాధీనం చేసున్నట్లు డిఎస్పీ చెప్పారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం వాణీయంబాడీకి చెందిన గాడ్విన్ మోస్‌స(33),అతని అనుచరులు మురుగన్(37),విఘ్నే్‌ష(26) గుర్తించారు. వీరిపై ఆంధ్ర,తమిళనాడు రాష్ర్టాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసును చేధించి సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాలను డీఎస్పీ అభినిందించి వారికి నగదు రివార్డును అందజేశారు.