Share News

కిటకిటలాడిన శ్రీకాళహస్తి

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:25 AM

శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం విశేషంగా గ్రహణ కాలాభిషేకం జరిగింది. ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను కవచంగా ధరించి కొలువవడంతో గ్రహణ దోషాలు ఆలయంలో ఉండవనేది ప్రసిద్ధి. అందుకే రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధిచెందిన విషయం తెలిసిందే.మంగళశారం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా వివిఽధ ఆలయాలు మూసివేసినప్పటికీ ముక్కంటి ఆలయంలో యధావిధిగా దర్శనాలు కొనసాగాయి.

కిటకిటలాడిన శ్రీకాళహస్తి
ముక్కంటి దర్శనానికి వెళుతున్న భక్తులు

శ్రీకాళహస్తి, మార్చి 3(ఆంద్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం విశేషంగా గ్రహణ కాలాభిషేకం జరిగింది. ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడు నవగ్రహాలను కవచంగా ధరించి కొలువవడంతో గ్రహణ దోషాలు ఆలయంలో ఉండవనేది ప్రసిద్ధి. అందుకే రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధిచెందిన విషయం తెలిసిందే.మంగళశారం కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా వివిఽధ ఆలయాలు మూసివేసినప్పటికీ ముక్కంటి ఆలయంలో యధావిధిగా దర్శనాలు కొనసాగాయి. గ్రహణ స్పర్శకాలం 3.20గంటలకు మొదలుకాగా మధ్యకాలం 5.03గంటలకు, మోక్షకాలం 6.47గంటలకు జరిగింది. గ్రహణకాలంలో 5గంటలకు ఉచ్ఛికాలంగా నిర్ణయించిన అర్చకులు మూలమూర్తులైన స్వామి అమ్మవార్లకు అభిషేకాలను నిర్వహించారు. భక్తులు గ్రహణ విశేష అభిషేకాలను దర్శించుకున్నారు. మంగళవారం సుమారు 30వేల మంది భక్తులు ముక్కంటీశుడిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Mar 04 , 2026 | 01:25 AM