Share News

టైర్లు లేపేశారు!

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:49 AM

ఇంటి ముందే ఉంటుంది. అందునా రోడ్డు పక్కన ఆపాం. ఏమవుతుందిలే అని అనుకున్నారా మినీ లారీ యజమాని. కానీ, ఆ దొంగలు మహా ముదుర్లు. దీని పక్కన మరో లారీ పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా రెండు టైర్లు తీసికెళ్లిపోయారు. ఈ ఘటన నాగలాపురం మండలం సురుటుపల్లిలో జరిగింది

టైర్లు లేపేశారు!

నాగలాపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ఇంటి ముందే ఉంటుంది. అందునా రోడ్డు పక్కన ఆపాం. ఏమవుతుందిలే అని అనుకున్నారా మినీ లారీ యజమాని. కానీ, ఆ దొంగలు మహా ముదుర్లు. దీని పక్కన మరో లారీ పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా రెండు టైర్లు తీసికెళ్లిపోయారు. ఈ ఘటన నాగలాపురం మండలం సురుటుపల్లిలో జరిగింది. లారీ యాజమాని తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం ఊత్తుకోటకి చెందిన షణ్ముగం కొన్ని నెలలుగా సురుటుపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. తన మినీ లారీ ద్వారా టమోటాలు రవాణా చేస్తున్నారు. నెల రోజులుగా వ్యాపారం లేకపోవడంతో తన ఇంటి ఎదుట జాతీయ రహదారి పక్కనే వాహనాన్ని ఆపారు. సోమవారం అర్ధరాత్రి ఎవరికీ అనుమానం రాకుండా మినీ లారీ పక్కన మరో వాహనాన్ని ఉంచారు. ఒక స్టెప్నీతో మినీ లారీ వెనుక వైపు లేపి.. రెండు చక్రాలను తొలగించి తమ వాహనంలో వేసుకుని పరారయ్యారు. రెండు టైర్లు లేకపోవడాన్ని మంగళవారం ఉదయం చూసిన షణ్ముగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. కాగా చోరీకి గురైన లారీ చక్రాల విలువ రూ.70 వేలు ఉంటుందని యజమాని వాపోయారు.

Updated Date - Jan 14 , 2026 | 01:49 AM