చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:24 AM
పదమూడు నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది. చిన్నా రి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ... పాపను ప్రేమగా చూసుకుంటూ... నమ్మకం గా పొరుగున ఉన్నవారే జయశ్రీని కిడ్నాప్ చేశారు.
తల్లి ఒడి చేరిన జయశ్రీ
కిడ్నాపర్లతోపాటు మరో నలుగురి అరెస్ట్
తిరుపతి (నేరవిభాగం), జనవరి 23 (ఆంధ్ర జ్యోతి): పదమూడు నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది. చిన్నా రి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ... పాపను ప్రేమగా చూసుకుంటూ... నమ్మకం గా పొరుగున ఉన్నవారే జయశ్రీని కిడ్నాప్ చేశారు. అయితే 48 గంటల్లోనే ఈస్ట్ పోలీసు లు ఈ కేసును ఛేదించి పాపను క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారు. వ్యర్థ పదార్థాలను సేక రించి విక్రయిస్తూ జీవనం సాగించే మస్తాన్, సుచిత్ర దంపతులు తిరుపతిలోని చింతలచేను ప్రాంతంలో ఓ చిన్న గదిలో నివాసం ఉంటున్నారు. పక్క గదిలోనే తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన భార్యాభర్తలు మురుగన్ అలియాస్ కందన్, మారెమ్మ నివాసం ఉంటున్నారు. వ్యర్థ పదార్థాల వ్యాపారమే నిర్వహించే వీరు. నిత్యం చిన్నారి జయశ్రీని తమ ఇంటికి తీసుకెళ్లి ఆడిస్తూ వుండేవారు. గత బుధవారం ఉదయం చిన్నారిని తమ ఇంటికి తీసుకెళ్లిన మారెమ్మ, మురుగన్ మాయమయ్యారు.కొంత ఆలస్యంగా గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.డీఎస్పీ భక్తవత్సలనాయుడు, సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్ప డిన పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి మురుగన్, మారెమ్మ చిన్నారి జయశ్రీని ఉదయం 10.30 గంటల సమయంలో టీవీఎస్ స్కూటీపై తీసుకెళ్లినట్లు గుర్తించారు .కాంచీపురం ప్రాంతానికి చెందినవారని తెలుసుకుని తమిళనాడుకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపించారు. చివరకు నిందితుల జాడ కనుగొన్న పోలీసులు కాట్పాడిలో కిడ్నాపర్లతోపాటు మరో నలు గురిని అరెస్ట్ చేశారు. చిన్నారి జయశ్రీని క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు.కాగా పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భిక్షాటనకు ఉపయోగించేందుకుగాను చిన్నారిని కిడ్నాపర్లు వేరొకరికి తక్కువ ధరకు అమ్మే సినట్టు సమాచారం. బుధవారం ఉదయం 10.30 గంటలకు పాపతో తిరుపతి నుంచి బయలుదేరిన కిడ్నాపర్లు నేరుగా కాట్పాడికి చేరుకున్నారు. మధ్యవర్తి సాయంతో పాపను రూ.25 వేలకు విక్రయించారు. పాపను కొనుగోలు చేసిన వారు మరో మధ్యవర్తి ద్వారా చెన్నైలో భిక్షాటన చేయించేవారికి ఆ పాపను విక్రయించారు.పాప గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలోపే తిరుపతి పోలీ సులు రంగ ప్రవేశం చేశారు. కిడ్నాపర్లతో పాటు కొనుగోలుదారులు, మధ్యవర్తు లను అరెస్ట్ చేశారు.ఇదివరకు కూడా పిల్లలను వీరు కిడ్నాప్ చేశారా అనే కోణంలో ఈస్ట్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.