Share News

విరిసినదీ వసంతగానం

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:53 AM

ఎస్వీయూ ప్రాంగణంలో విరబూసిన ఈ గోల్డెన్‌ ట్రంపెట్‌ ట్రీ పుష్ప సోయగంతో వసంత గానం పాడుతున్నట్లు లేదూ. బంగారు గంటల చెట్టుగా పిలవబడే ఈ చెట్టు

విరిసినదీ వసంతగానం

- ఎస్వీయూలో విరబూసిన గోల్డెన్‌ ట్రంపెట్‌ ట్రీ

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 23 (ఆంధ్రజ్యోతి):ఎస్వీయూ ప్రాంగణంలో విరబూసిన ఈ గోల్డెన్‌ ట్రంపెట్‌ ట్రీ పుష్ప సోయగంతో వసంత గానం పాడుతున్నట్లు లేదూ. బంగారు గంటల చెట్టుగా పిలవబడే ఈ చెట్టు తీవ్రమైన ఎండా కాలంలోనూ నిలదొక్కుకోవడం దీని ప్రత్యేకత. బిగ్నోనియేసి ఫ్యామిలీకి చెందిన చెట్లన్నీ దాదాపుగా ఎలాంటి కాలంలో అయినా మనుగడ సాగిస్తాయి.ఎస్వీ యూనివర్సిటీలో పదుల సంఖ్యలో వున్న ఈ గోల్డెన్‌ ట్రంపెట్‌ ట్రీస్‌ ప్రకృతిని కాంతివంతంగా చూపెడుతున్నాయి.ఫొటోలో కన్పిస్తున్న చెట్టు ఎస్వీయూ నుంచీ స్విమ్స్‌లోకి ప్రవేశించే మార్గంలో వెళ్లేవారిని కట్టి పడేస్తోంది. పచ్చని యూనివర్సిటీ ప్రాంగణానికి అదనపు అలంకరణగా నిలిచిన ఈ చెట్టు, ఆకులు రాలినా వాటి రెమ్మలపై పుష్పగుచ్చాల్లాగా బంగారు వన్నెతో పూలు పూయడం గమనార్హం.

Updated Date - Mar 24 , 2026 | 12:53 AM