కల్పవృక్ష వాహనంపై పార్వతీ తనయుడు
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:51 AM
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా బుధవారం కల్పవృక్ష వాహనంపై వినాయకస్వామి విహరిస్తు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చక, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా బుధవారం కల్పవృక్ష వాహనంపై వినాయకస్వామి విహరిస్తు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చక, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్‌కు పంచామృత అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ వరస రావడంతో అణివేటి మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు విశేష పూజలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కల్పవృక్ష వాహనంపై ఉంచి భాజాభజంత్రీలు వాయిస్తూ నృత్యాలు చేస్తు కాణిపాకం పుర వీధులలో ఊరేగించారు. ఆలయ ఆస్థాన మండపంలోని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్, ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనపాల్, హరిమాధవరెడ్డి, ప్రసాద్, సూపరింటెండెంట్లు శ్రీధ ర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, అర్చక, వేదపండితులు, బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.