ఠారెత్తిస్తున్న ఎండలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:45 AM
భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆరెంజ్ జోన్‌లోకి ఎస్‌ఆర్‌పురం
40 డి గ్రీలకు మించి తొమ్మిది మండలాల్లో ఉష్ణోగ్రతల నమోదు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే రికార్డుస్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఠారెత్తిస్తున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం అత్యధికంగా ఎస్‌ఆర్‌పురంలో 41.7 డిగ్రీ నమోదై ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లింది. మండలాల వారీగా.. తవణంపల్లెలో 41.3, నగరిలో 40.9, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాలలో 40.6, పెద్ద పంజాణిలో 40.4, గంగాధరనెల్లూరులో 40.2, గంగవరం, పలమనేరులో 39.9, నిండ్ర, విజయపురంలో 39.2, బంగారుపాళ్యం, రామకుప్పం, ఐరాల, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 38.9, వెదురుకుప్పం, పులిచెర్లలో 38.7, పూతలపట్టులో 38.3, రొంపిచెర్లలో 38, కుప్పం, శాంతిపురంలో 37.4, కార్వేటినగరంలో 37.3, గుడుపల్లెలో 37.1, బైరెడ్డిపల్లె, వి.కోటలో 35.9 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రత నమోదైంది.