Share News

రంకేసిన కోడెగిత్తలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 02:01 AM

సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం రామచంద్రాపురం మండలం అనుపల్లెలో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టుకు వారం నుంచే రైతులు తమ కోడెగిత్తలకు కొమ్ములు చివ్వి సిద్ధం చేశారు.

రంకేసిన కోడెగిత్తలు
కోడెగిత్తలను నిలువరిస్తున్న యువకులు

రామచంద్రాపురం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం రామచంద్రాపురం మండలం అనుపల్లెలో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టుకు వారం నుంచే రైతులు తమ కోడెగిత్తలకు కొమ్ములు చివ్వి సిద్ధం చేశారు. వాటికి విలువైన బహుమతులతో పాటు రాజకీయ నాయకుల ఫొటోలను కట్టి ఉదయం అల్లె వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వాటివెనుక డప్పు కొట్టి బెదిరించడంతో అవి వీధుల్లోకి పరుగులు తీశాయి. వాటిని నిలువరించి బహుమతులు చేజిక్కుంచుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. అందుకున్న బహుమతులతో యువకులు కేకలేశారు. వెదురుకుప్పం, వడమాలపేట, తిరుపతి రూరల్‌ మండలాలతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాదిమంది జల్లికట్టును తిలకించేందుకు రావడంతో అనుపల్లి జనసంద్రమైంది.

Updated Date - Jan 15 , 2026 | 02:01 AM