ముందే వచ్చిన ముగ్గుల సంక్రాంతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:12 AM
నింగిలో విరిసే హరివిల్లు నేలకు దిగింది. రంగురంగుల ముగ్గులతో చిత్తూరులోని ఎన్‌పీసీ పెవిలియన్ ప్రాంగణం కళకళలాడింది. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఏటా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలో వేడుకగా జరిగాయి. ఫరవ్ ్డబై సన్‌ఫీస్టు మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్టు పార్టనర్ స్వస్తిక్ మసాల, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారతవాసి అగరబత్తీ సౌజన్యంతో లోకల్ స్పాన్సర్‌గా విజయం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. విజేతలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌పీ వెంకటేశ్వర చౌదరి, విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి బహుమతులు అందజేశారు.

చిత్తూరు సెంట్రల్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):పండుగల నేపధ్యంలో మన పూర్వీకులందించిన సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరులోని ఎన్‌పీసీ పెవిలియన్ ఆవరణలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.ఆంధ్రజ్యోతి,ఏబీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతూర్ ముగ్గుల పోటీలు....పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ సౌజన్యంతో నిర్వహించిన ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలకు లోకల్ స్పాన్సర్‌గా విజయం విద్యా సంస్థలు వ్యవహరించాయి. 240మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో చుక్కల ముగ్గులను రంగులతో అలంకరించారు. పలువురు పండుగ వాతావరణం తలపించేలా సాంప్రదాయానికి అద్దంపడుతూ గొబ్బెమ్మలు, చెరకుగడలు, బొమ్మల కొలువులతో ముగ్గులను తీర్చిదిద్దారు.ముఖ్య అతిఽథిగా హాజరైన కలెక్టర్ సుమిత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌పీ వెంకటేశ్వర చౌదరి, విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతికి జీవం పోయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయనిర్ణేతలుగా విజయం విద్యాసంస్థల అకడమిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శైలజామూర్తి, ఎన్‌పీ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.ఉషారాణి, రచయితల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంఆర్ అరుణకుమారి వ్యవహరించారు. ప్రథమ బహుమతిని పాకాలకు చెందిన ఎ.సునీత , ద్వితీయ బహుమతిని చిత్తూరులోని మురకంబట్టు అగ్రహారానికి చెందిన జి.ప్రతిభ , తృతీయ బహుమతిని చిత్తూరులోని బీసీ నాయుడు కాలనీ, కేఆర్‌పల్లెకు చెందిన డి.బుజ్జీరావు అందుకున్నారు. ప్రోత్సాహక బహుమతులను షాలిని, మాలిని, అదిషయ, మసీహభాను, విజయలక్ష్మి, అభినయ, దేవి, దివ్య, రక్షిత, ధరణి అందుకున్నారు.ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్‌చార్జి షేక్ కరీముల్లా, ఏబీఎన్ స్టాఫ్ రిపోర్టర్ మనోహరరెడ్డి, ఏడీవీటీ ఇన్‌చార్జి విద్యాసాగర్,ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.