పోలీసులంటే ప్రజలకు భరోసా
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:16 AM
ప్రజా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పోలీసులు క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి సూచించారు. తొమ్మిది నెలల శిక్షణను పూర్తి చేసుకున్న 142 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శనివారం పోలీసు పెరేడ్ మైదానంలో దీక్షాంత్ పెరేడ్‌ను నిర్వహించారు.
చిత్తూరు అర్బన్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రజా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా పోలీసులు క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి సూచించారు. తొమ్మిది నెలల శిక్షణను పూర్తి చేసుకున్న 142 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శనివారం పోలీసు పెరేడ్ మైదానంలో దీక్షాంత్ పెరేడ్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించేలా ప్రతి పోలీసు విధులు నిర్వహించాలన్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దారుఢ్యం, నైపుణ్యాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ ప్రజలు తమను ఆశ్రయించేలా పోలీసులు నమ్మకాన్ని కలిగించాలన్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసా లు, మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళలు, చిన్నారుల భద్రత వంటి అంశాలపై నిరంత రం అవగాహన పెంచుకోవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, ఏఎస్పీలు మహబూబ్ బాష, షాను, దేవదాస్, జిల్లా పోలీసు అధికారులు,పోలీసు శిక్షణా కేంద్ర సిబ్బంది, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీక్షాంత్ పెరేడ్ సందర్భంగా ప్రతిభ కనబరిచిన పోలీసు కానిస్టేబుళ్లకు మంత్రి, అధికారులు మె మెంటోలను అందించారు. బెస్ట్ ఆల్ రౌండర్‌గా, బెస్ట్ అవుట్‌డోర్‌గా చీకటి మూర్తి, బెస్ట్ ఇండోర్‌గా వెంకటేశ్, ఫైరింగ్‌లో వినయ్‌లకు మెమెంటోలను అందించారు.