నందివాహనంపై ముక్కంటీశుడి చిద్విలాసం
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:05 AM
సింహ వాహనంపై అనుసరించిన జ్ఞాన ప్రసూనాంబ
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): శివరాత్రిని పురస్కరించుకుని దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాహస్తి క్షేత్రం ఆదివారం భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. ఉదయం నుంచే ముక్కంటి ఆలయం కిటకిటలాడింది. వేకువజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. వాయులింగేశ్వరుడు నిజమూర్తిగా దర్శనమిచ్చారు. స్వామికి, జ్ఞానప్రసూనాంబకు వివిధ రకాల అభిషేకాలు చేశారు. ఆలయంలోపల మహాలఘు దర్శనాన్ని అమలు చేయగా, సుమారు లక్షన్నర మంది దర్శించుకుని ఉంటారని ఆలయాధికారులు అంచనా వేశారు. దర్శనానంతరం భక్తులను మహద్వారం వైపు రాకుండా.. మృత్యుంజయ లింగం వద్ద నుంచి ఆలయం పైకి వెళ్లి.. భక్తకన్నప్ప కొండ మెట్ట మార్గం వద్దకు చేరుకునేలా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. స్వర్ణముఖిలో తమ పెద్దలకు తర్పణాలు విడిచేందుకు కూడా భక్తులు పోటెత్తారు.
ఇంద్ర విమానంపై..
ఇంద్రవిమానంపై పరమేశ్వరుడు, చప్పరంపై జ్ఞాన ప్రసూనాంబదేవి పురవిహారం చేశారు. మూషిక వాహనంపై వినాయకుడు, వల్లీ దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగింపులో ముందు సాగారు. కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఉభయదారులు పాల్గొన్నారు. రాత్రి నందివాహనంపై స్వామివారు దర్శనమివ్వగా, జ్ఞానప్రసూనాంబ సింహవాహనాన్ని అధిరోహించి అనుసరించారు.