భానుడి భగభగలకు ఠారెత్తిన జనం
ABN , Publish Date - May 21 , 2026 | 02:00 AM
తిరుపతి జిల్లాలో భానుడి భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. నెత్తి మాడుతుండటంతో గొడుగులను అడ్డుపెట్టుకోవాల్సి వస్తోంది.
తిరుపతి అర్బన్, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భానుడి భగభగలకు జనం విలవిల్లాడిపోతున్నారు. నెత్తి మాడుతుండటంతో గొడుగులను అడ్డుపెట్టుకోవాల్సి వస్తోంది. బుధవారం ఉదయం 11గంటల నుంచే ఎండతీవ్రత పెరిగి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. దీంతో జనం ఠారెత్తిపోయారు. మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. జాతీయ రహదారిపైనా వాహనాలు పలుచగా కనిపించాయి. ద్విచక్ర వాహన చోదకులు నీడున్న స్థలంలో సేదతీరడం కనిపించింది.
డీవీసత్రంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తిరుపతి(కలెక్టరేట్), మే 20(ఆంధ్రజ్యోతి): డీవీసత్రం మండలం పూలతోటలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మండలాల వారీగా.. తొట్టంబేడులో 43.9, ఓజిలిలో 43.6, సత్యవేడు, తడలో 43.4, పెళ్లకూరు, డక్కిలిలో 43.2, నాయుడుపేట, శ్రీకాళహస్తి, ఏర్పేడులో 42.9, వెంకటగిరిలో 42.7, కేవీబీపురం, నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు, పుత్తూరు, సూళ్లూరుపేటలో 42.6, బీఎన్‌కండ్రిగలో 42.4, తిరుపతి రూరల్‌లో 42.2, పెనగలూరులో 41.9, ఆర్‌సీపురంలో 41,.8, చంద్రగిరి, వడమాలపేట, వరదయ్యపాళెంలో 41.4, తిరుపతి అర్బన్‌లో 40.8, చిట్వేలు, కోడూరు, ఓబులవారిపల్లెలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మరో మూడ్రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.