Share News

ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:39 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాయచోటిలో కూటమిది చరిత్రాత్మక విజయమని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు.

ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మున్సిపల్‌, ఎంపీటీసీ స్థానాలన్నీ కైవసం

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రాయచోటిలో కూటమిది చరిత్రాత్మక విజయమని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. శనివారం రాయచోటిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని, రాయలసీమలో కూటమికి అనూహ్య ప్రజాదరణ లభించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలకు, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీలో 44 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారన్నారు. 2005లో మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి తొలిసారిగా రాయచోటిలో టీడీపీ జెండా ఎగురవేశారని, అలాగే రాయచోటి నియోజవర్గంలోని 67 ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ స్థానాల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని, నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తో విజయం సాధించామని పేర్కొన్నారు.

Updated Date - Nov 08 , 2026 | 02:39 AM