న్యూటన్ ఎలక్ర్టిక్ బస్సు వచ్చేసింది
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:43 AM
న్యూటన్ ఎలక్ర్టిక్ బస్సు మంగళవారం ఆర్టీసీ తిరుపతి డిపోకు చేరుకుంది. పూణె నుంచి కంటైనర్‌లో సోమవారం అర్ధరాత్రి రేణిగుంట శివారు ప్రాంతానికి చేరుకోగా, అక్కడి నుంచి మంగళవారం మధ్యాహ్నం అదే కంపెనీ డ్రైవర్ బస్సును సెంట్రల్ బస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
తిరుపతి(ఆర్టీసీ), జనవరి 27(ఆంధ్రజ్యోతి): న్యూటన్ ఎలక్ర్టిక్ బస్సు మంగళవారం ఆర్టీసీ తిరుపతి డిపోకు చేరుకుంది. పూణె నుంచి కంటైనర్‌లో సోమవారం అర్ధరాత్రి రేణిగుంట శివారు ప్రాంతానికి చేరుకోగా, అక్కడి నుంచి మంగళవారం మధ్యాహ్నం అదే కంపెనీ డ్రైవర్ బస్సును సెంట్రల్ బస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సాంకేతిక నిపుణులు బస్సు కొలతలు, సౌకర్యాలను గుర్తించి నమోదుచేశారు. బుధవారం ఉదయం డిపో ఆవరణంలోనే ప్రాథమిక పూజలు నిర్వహించాక ఖాళీ బస్సు కాణిపాకం బయల్దేరుతుంది. మధ్యాహ్నం అక్కడ పూజలు నిర్వహించి, తిరిగి తిరుపతికి చేరుకుంటుంది. ఆర్టీసీ అధికారుల నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1నుంచి తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య ప్రయోగాత్మకంగా తిరగనుంది. ఈ బస్సు పూర్తిగా ఏసీ, ఎయిర్ ఇండిపెండెంట్ సస్పెన్షన్స్ వీల్స్, లోపల బయట కలిపి 7 కెమెరాలు, ఆటోమేటిక్ డోర్స్, బస్సు నీలింగ్, మానిటరింగ్, అనౌన్స్‌స్పీకర్, గేరు లేకుండా ఫ్రంట్, బ్యాక్, పార్కింగ్, న్యూటర్ల్, స్పీడ్, చార్జింగ్ పర్సంటేజ్, కిలోమీటర్, అడ్జెస్టింగ్ స్టీరింగ్, ఎయిర్ సస్పెన్షన్ డ్రైవర్‌సీటు, రివర్స్ కెమెరా, అలారమ్, హేమర్, 34 సీట్లు వంటి ఆధునకి సౌకర్యాలు కలిగి వున్నాయని, ప్రయాణికులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచిచూడాల్సి ఉందని అధికారులు తెలిపారు.