కల్కిగా కరుణామృతం
ABN , Publish Date - Oct 20 , 2026 | 02:03 AM
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనమైన అశ్వవాహనంపై సోమవారం రాత్రి మలయప్పస్వామి కల్కిగా భక్తకోటిని కటాక్షించారు. వర్షం కురిసి ఆగిపోయాక చల్లటి వాతావరణంలో రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది.
తిరుమల, అక్టోబర్ 19(ఆంధ్రజ్యోతి):శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనమైన అశ్వవాహనంపై సోమవారం రాత్రి మలయప్పస్వామి కల్కిగా భక్తకోటిని కటాక్షించారు. వర్షం కురిసి ఆగిపోయాక చల్లటి వాతావరణంలో రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, జీయర్ల గోష్టి, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణలతో అశ్వవాహనసేవ ఆధ్యాత్మిక ఆనందాన్ని చేకూర్చింది. అశ్వటీటీడీ జీయర్‌స్వాములు, చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఉదయం స్వర్ణరథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు తిరువీధుల్లో పయనిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు కూడా భారీ సంఖ్యలో స్వర్ణరథ సేవలో పాల్గొన్నారు. మహిళలు పోటీపడి తాళ్లను తాగుతూ స్వామి రథాన్ని ముందుకు నడిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సువర్ణతేరు ఉత్సవం 9గంటలకు ముగిసింది. అనంతరం ఆలయానికి వేంచేసిన ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా కొలువు, ఆస్థానం, విశేష సమర్పణ కావించారు.