Share News

భక్తులతో కిక్కిరిసిన ముక్కంటి ఆలయం

ABN , Publish Date - Aug 19 , 2026 | 02:12 AM

శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 29వేలమంది స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులతో కిక్కిరిసిన ముక్కంటి ఆలయం
క్యూలో వెళుతున్న భక్తులు

శ్రీకాళహస్తి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 29వేలమంది స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం ద్వారా 368మంది, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 1,324మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1,732మంది దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా2,563మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 775మంది, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 351మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 267మంది, రూ.5వేల టిక్కెట్ల ద్వారా 100మంది పూజలుచేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 17,875 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Aug 19 , 2026 | 02:12 AM