Share News

శోకసంద్రమైన స్వర్ణముఖి తీరం

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:18 AM

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి చేతిలోనే హతమైపోయిన రెండున్నరేళ్ల బాలిక దుర్గ మృతదేహం చూసి మ్రాన్పడిపోయింది.ఒడిలో హాయిగా నిదురపుచ్చాల్సిన అమ్మే తన సుఖజీవనానికి అడ్డొస్తోందని చేతివేళ్లనే ఉరితాళ్లుగా మార్చి గొంతుపిసికి చంపేసిన వైనం తెలిసి మౌనంగా రోదించింది.

 శోకసంద్రమైన స్వర్ణముఖి తీరం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి చేతిలోనే హతమైపోయిన రెండున్నరేళ్ల బాలిక దుర్గ మృతదేహం చూసి మ్రాన్పడిపోయింది.ఒడిలో హాయిగా నిదురపుచ్చాల్సిన అమ్మే తన సుఖజీవనానికి అడ్డొస్తోందని చేతివేళ్లనే ఉరితాళ్లుగా మార్చి గొంతుపిసికి చంపేసిన వైనం తెలిసి మౌనంగా రోదించింది. తల్లి ఆశాలత చేతిలో చనిపోయిన దుర్గ మృతదేహాన్ని బుధవారం ఉదయం ఏర్పేడు మండల పరిధిలోని చెన్నంపల్లె-పాపానాయుడుపేట సరిహద్దులో వున్న స్వర్ణముఖి తీరంలో వెలికితీశారు.గుంత తవ్వి పూడ్చిపెట్టడంతో ఏర్పేడు తహసీల్దార్‌ భార్గవి సమక్షంలో ఎస్వీ మెడికల్‌ కళాశాల వైద్యులు బుధవారం చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.దుర్గ మృతదేహాన్ని చూసిన ఆమె అమ్మమ్మ, తాత నాగరత్నమ్మ, రంగ గుండెలు పగిలేలా రోదించారు. చూడ్డానికి వచ్చిన చెన్నపల్లె గ్రామస్తులు,తహసీల్దారు భార్గవి కూడా పసికందు మృతదేహాన్ని చూసి చలించిపోయారు.

- తిరుపతి(నేరవిభాగం)/ఏర్పేడు, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 26 , 2026 | 01:18 AM