వెంకటగిరి కుర్రాళ్ల అద్భుతం
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:20 AM
వెంకటగిరికి చెందిన ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థులు అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ రేటింగ్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు.తాజాగా విడుదలైన రేటింగ్ జాబితాలో పట్టణానికి చెందిన కలవ దమరేష్ 1498 రేటింగ్, కలవకొల్లు మధుశ్రీతన్ 1442 రేటింగ్ సాధించారు.
అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ రేటింగ్‌లో స్థానం
వెంకటగిరి, జూన్ 1(ఆంధ్రజ్యోతి):వెంకటగిరికి చెందిన ఇద్దరు ఏడవ తరగతి విద్యార్థులు అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ రేటింగ్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు.తాజాగా విడుదలైన రేటింగ్ జాబితాలో పట్టణానికి చెందిన కలవ దమరేష్ 1498 రేటింగ్, కలవకొల్లు మధుశ్రీతన్ 1442 రేటింగ్ సాధించారు. దమరేష్ వెంకటగిరి మోడల్ స్కూల్ విద్యార్థి కాగా మధుశ్రీతన్ మదర్‌అకాడమీ స్కూల్‌లో చదువుకుంటున్నారు.చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 24,25,26తేదీల్లో జరిగిన అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ (బిలో 1650రేటింగ్)లో అవసరమైన పాయింట్లు సాధించారు. సాధారణంగా రేటింగ్ సాధించడానికి పలుమార్లు అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో పాల్గొనాల్సి వస్తుంది. అయితే ఈ ఇద్దరు విద్యార్థులు తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకొని ప్రతిభ చాటడం విశేషం. మూడేళ్లుగా వెంకటగిరిలోని విజయ్ చెస్ అకాడమీలో వీరు శిక్షణ పొందుతున్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమకు ఈ విజయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అకాడమీ వ్యవస్థాపకుడు, చెస్ కోచ్ విజయ్ నర్రా తెలిపారు.