విద్యార్థులను భయపెడుతున్న మద్యం భూతం
ABN , Publish Date - Nov 03 , 2026 | 01:33 AM
వందేళ్ల విశిష్ట చరిత్ర ఉన్న పాఠశాల ఎదుట మద్యం దుకాణం నిర్వహించడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 105 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ పాఠశాలలో చదివిన ఎందరో పేరుప్రఖ్యాతులు గడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి వ్యవసాయ మంత్రి అద్దూరి బలరామిరెడ్డి, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం,
- జడ్పీ బాలుర హైస్కూల్ ఎదుట మద్యం దుకాణం
- ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
శ్రీకాళహస్తి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వందేళ్ల విశిష్ట చరిత్ర ఉన్న పాఠశాల ఎదుట మద్యం దుకాణం నిర్వహించడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రీకాళహస్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 105 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ పాఠశాలలో చదివిన ఎందరో పేరుప్రఖ్యాతులు గడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి వ్యవసాయ మంత్రి అద్దూరి బలరామిరెడ్డి, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రెండు దఫాలు రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు ఈ బడిలో ఓనమాలు దిద్దినవారే. విశ్రాంత ఐఏఎస్ అధికారి గుమ్మడి బలరామయ్య ఇక్కడే చదివారు. ఇలా చాలామంది ప్రముఖుల ఈ పాఠశాల పూర్వవిద్యార్థులే.
వైసీపీ హయాంలో నిర్వహణ గాలికి..
గత వైసీపీ పాలకులు పాఠశాల నిర్వహణను గాలికి వదిలేశారు. ప్రస్తుతం పాఠశాల ఎదుట నిర్వహిస్తున్న మద్యం దుకాణంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా దీనిని తొలగించాలని స్థానికులు పోరాడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు లైసెన్స జారీపై స్థానికులు కోర్టును ఆశ్రయించారు. మళ్లీ ఈనెలలో కొత్తలైసెన్సు రెన్యువల్ చేయాల్సి ఉంది. ఇప్పుడైనా రెన్యువల్ చేయకుండా దుకాణాన్ని వేరే చోటుకు మార్చాలని స్థానికులు, పాఠశాల పేరంట్స్ కమిటీ బృందం గగ్గోలు పెడుతున్నారు. ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య లిఖిత పూర్వకంగా ఎక్సైజ్ అధికారులను అభ్యర్థించారు. అయినా మద్యం అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దశలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, స్థానిక ఎక్సైజ్ సిబ్బందితో కలిసి పాఠశాల గేటు నుంచి మద్యం దుకాణం వరకు దూరాన్ని కొలిచారు. 37.5మీటర్లు దూరం మాత్రమే ఉన్నట్లుగా తేలినట్లు సమాచారం. నిబందనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నమద్యం దుకాణాన్ని వేరేచోటుకు మార్చేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. కాగా కొత్త దుకాణం మంజూరు అయినా, తాత్కాలికంగా అమ్మకాలు సాగించుకునేలా అనుమతించామని ఎక్సైజ్ఎ్సఐ భాస్కర్ చెప్పారు. పక్కా రెన్యువల్ చేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లామని వివరించారు.
హెచ్ఎం చొరవవో పూర్వ వైభవం
ఎందరో అగ్రగణ్యులు అక్షరాలు దిద్దిన ఈ పాఠశాలలో ఆరేళ్ల క్రితం వరకు 1,400 నుంచి 1,550 వరకు విద్యార్థుల సంఖ్య ఉండేది. తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 450కి పడిపోయింది. 1997లో 75 వసంతాల వేడుక సందర్భం గా అప్పటి మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డి రాష్ట్రంలోనే తొలిసారి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ం కొత్త తరగతిగదుల నిర్మాణానికి ఆర్థిక సాయం మంజూరుచేశారు. ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థిని గత ఏడాది జూన్లో ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. అప్పటినుంచి పాఠశాలలో కొంత ప్రక్షాళన ప్రారంభమైంది. ఈ యేడాది విద్యార్థుల సంఖ్య 763కు పెరిగింది నాలుగేళ్ల క్రితం విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఉపాధ్యాయుల సంఖ్య 27కు కుదించారు. ఇపుడు విద్యార్థుల సంఖ్యపెరిగినా కొత్త ఉపాధ్యాయులను నియమించలేదు.