అమర జవాన్ స్మృత్యర్థం.....
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:57 AM
జమ్మూ కశ్మీర్‌లో గత సంవత్సరం జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన పంగల కార్తీక్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటకు చెందిన వరదరాజులు, సెల్వి దంపతుల చిన్నకుమారుడు పంగల కార్తీక్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన విగ్రహాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఆవిష్కరించనున్నట్లు అమరజవాన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మామిడి ఏడుకొండలు తెలిపారు.
నేడు బంగారుపాళ్యంలో కార్తీక్ విగ్రహావిష్కరణ
బంగారుపాళ్యం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో గత సంవత్సరం జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన పంగల కార్తీక్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటకు చెందిన వరదరాజులు, సెల్వి దంపతుల చిన్నకుమారుడు పంగల కార్తీక్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఆయన విగ్రహాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఆవిష్కరించనున్నట్లు అమరజవాన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మామిడి ఏడుకొండలు తెలిపారు.కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీ మోహన్, మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్‌పీ ధరణీ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు ఎన్‌పీ జయప్రకాష్, మాజీ సైనికులు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.