రైతులపైకి దూసుకొచ్చిన మదపుటేనుగు
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:47 AM
ఎర్రావారిపాళెం మండలం చింతగుంట పంచాయతీలోని పంట పొలాలపై పడుతున్న మదనపుటేనుగు చివరకు రైతులుపైకీ దూసుకొచ్చింది. దీంతో వారు ప్రాణభయంతో ఇళ్లకు పరుగులు తీశారు.
- ప్రాణభయంతో ఇళ్లకు పరుగులు తీసిన వైనం
ఎర్రావారిపాలెం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎర్రావారిపాళెం మండలం చింతగుంట పంచాయతీలోని పంట పొలాలపై పడుతున్న మదనపుటేనుగు చివరకు రైతులుపైకీ దూసుకొచ్చింది. దీంతో వారు ప్రాణభయంతో ఇళ్లకు పరుగులు తీశారు. రైతులు తెలిపిన వివరాల మేరకు.. చింతగుంట పంచాయతీలోని పంటలపై ఓ మదనపుటేనుగు దాడి చేస్తోంది. దీంతో రైతులంతా కలిసి పొలాల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి చిన్నరామాపురానికి చెందిన రైతు రాజేష్ నాయుడు ఊరికి ఆనుకుని ఉన్న పొలంలో సాగు చేసిన వరిపంటపై ఆ ఏనుగు పడింది. దీన్నిచూసిన కాపలాగా ఉన్న రైతులంతా కలిసి బాణసంచా కాలుస్తూ.. శబ్దాలు చేస్తూ ఆ ఏనుగును తరిమివేయడానికి ప్రయత్నించారు. ఆ ఏనుగు మాత్రం బెదరకుండా పంటలపై స్వైరవిహారం చేస్తూ రైతులపైకి దూసుకొచ్చింది. వారు భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ మదపుటేనుగు బారి నుంచి తమ పంటలను రక్షించాలని వేడుకొంటున్నారు.