Share News

శేషుడిపై శ్రీవారు

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:03 AM

తిరుమలలో శుక్రవారం రాత్రి పెద్దశేషవాహనంపై మలయప్పస్వామి భక్తులకు అభయమిచ్చారు.

శేషుడిపై శ్రీవారు

తిరుమలలో శుక్రవారం రాత్రి పెద్దశేషవాహనంపై మలయప్పస్వామి భక్తులకు అభయమిచ్చారు. నాగులచవితి సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడై పెద్దశేషవాహనంలో విశేష అలంకరణతో కొలువుదీరి దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ మాడవీధుల్లో జరిగిన ఈ ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కర్పూర హారతులు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ వాహన సేవ వైభవోపేతంగా సాగింది.టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 14 , 2026 | 02:03 AM