ఆలయాల మూత
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:32 AM
చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను ఉదయం 6.20 గంటలకు మూసివేశారు. గ్రహణం సందర్భంగా ఉదయం, సాయంత్రం ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, నిజరూప దర్శనం, ప్రమాణం, పాలాభిషేకం, మహాహారతి, ఊంజల్ సేవ, ఏకాంత సేవను ఆలయాధికారులు నిలిపేశారు. గ్రహణ మోక్షానంతరం సాయంత్రం 6.47 గంటల తర్వాత ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, పుణ్యహవచనాన్ని నిర్వహించి.. రాత్రి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం నుంచి స్వామి దర్శనం యథావిధిగా ఉంటుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ తెలిపారు.
ఐరాల(కాణిపాకం), మార్చి 3 (ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ఆలయాలు మూతపడ్డాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను ఉదయం 6.20 గంటలకు మూసివేశారు. గ్రహణం సందర్భంగా ఉదయం, సాయంత్రం ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, నిజరూప దర్శనం, ప్రమాణం, పాలాభిషేకం, మహాహారతి, ఊంజల్ సేవ, ఏకాంత సేవను ఆలయాధికారులు నిలిపేశారు. గ్రహణ మోక్షానంతరం సాయంత్రం 6.47 గంటల తర్వాత ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, పుణ్యహవచనాన్ని నిర్వహించి.. రాత్రి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం నుంచి స్వామి దర్శనం యథావిధిగా ఉంటుందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆలయం మూతతో భక్తుల్లేక కాణిపాకం బోసి పోయింది. నిత్యం స్వామి దర్శనానికి వేలాదిగా వచ్చే భక్తులు.. గ్రహణం కారణంగా మంగళవారం రాలేదు. దీంతో ఆలయం వద్ద, పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.